టాప్ గేర్‌లో వైఎస్ జగన్: గుంటూరు జిల్లాలో పింఛన్ల పెంపు-బహిరంగ సభ అందులో భాగమే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. జనం బాట పట్టారు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా ప్రజలను కలుసుకోనున్నారు. వారితో మమేకం కానున్నారు. సంక్షేమ పథకాలను ఆయన జనం మధ్యే ప్రారంభించనున్నారు. వాటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నారు. డెలివరీ సిస్టమ్‌లో చోటు చేసుకున్నట్టుగా భావిస్తోన్న లోపాలను సవరించే ప్రయత్నం చేయనున్నారు. మరింత మెరుగైన పరిపాలనను అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

ప్రత్తిపాడులో బహిరంగ సభ ఉద్దేశం అదే..
ఇవ్వాళ వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పింఛన్ల పెంపు పథకాన్ని ఆయన ప్రారంభించారు. సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా పేద కుటుంబాల వారికి అందజేస్తోన్న 2,250 చొప్పున ఇస్తోన్న పింఛన్ మొత్తాన్ని 2,500కు పెంచింది ప్రభుత్వం. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించారు.

క్యాంప్ కార్యాలయాన్ని వీడి..
సాధారణంగా- ఇలాంటి నిధుల విడుదల కార్యక్రమాలను వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి చేపడుతుంటారు. జగనన్న ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న చేయూత, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అమ్మఒడి.. వంటి పథకాలన్నింటికీ ఇప్పటిదాకా ఆయన క్యాంప్ కార్యాలయం నుంచే నిధులను విడుదల చేస్తూ వచ్చారు. అర్హత ఉండీ సంక్షేమ పథకాల లబ్దిని పొందలేకపోయిన 9,30,809 కుటుంబాలకు వివిధ పథకాల కింద 703 కోట్ల రూపాయలను కిందటి నెల 28వ తేదీన క్యాంపు కార్యాలయం నుంచే విడుదల చేశారు.

ఈ దఫా మాత్రం.. జనం మధ్యే
కొత్త సంవత్సరం నుంచి ఆయన తన రూటు మార్చారు. పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని జనం మధ్యే నిర్వహించారు. దీనికోసం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఇదే తరహాలో.. ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని జనం మధ్యే నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేసే పరంపరకు బ్రేక్ వేశారు.

ప్రజల్లోకి..ప్రజల మధ్య..
ఇప్పటి నుంచి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం స్పష్టం చేశారు. ఇక మీదట ప్రభుత్వ సంక్షేమ పథకాలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి మధ్య నుంచే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి పథకం కలిగే లబ్దిని, ప్రయోజనాలను బహిరంగ సభల ద్వారా నేరుగా అందిస్తారని చెప్పారు.
Recommended Video

కేక్ కట్..
నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు జగన్‌ను ఆశీర్వదించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications