Nallari Brothers: మాజీ సీఎం కిరణ్ కీలక అడుగులు - వైసీపీ మంత్రి టార్గెట్ గా..!!

Nallari Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటు. కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఇచ్చినా..ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా నియమించిన ఏపీసీసీ కమిటీలో కిరణ్ ను కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మాత్రమే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పీలేరు వచ్చారు.

టీడీపీలో చేరిన తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కార్యక్రమాలకు హాజరయ్యారు. రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..చాలా రోజుల తరువాత నియోజకవర్గానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తాజా నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది. వైసీపీ మంత్రి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

నల్లారి వర్సస్ పెద్దిరెడ్డి

నల్లారి వర్సస్ పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తొలి నుంచి టీడీపీని వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ, 2014 రాష్ట్ర విభజనతో కిరణ్ రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. అప్పటికే కాంగ్రెస్ లో చీఫ్ విప్ గా..స్పీకర్ గా..సీఎంగా కిరణ్ పని చేసారు. కాంగ్రెస్ లో కొనసాగుతున్న సమయంలోనే ప్రస్తుత వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కిరణ్ కు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి.

2009 లో వైఎస్సార్ రెండో సారి గెలిచిన తరువాత పెద్దిరెడ్డికి తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. అదే సమయంలో కిరణ్ ను స్పీకర్ గా ఎంపిక చేసారు. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య కేబినెట్ లోనూ పెద్దిరెడ్డి మంత్రిగా కొనసాగారు. కిరణ్ సీఎం అవ్వటంతో పెద్దిరెడ్డికి మంత్రిగా అవకాశం దక్కలేదు. ఆ తరువాత పెద్దిరెడ్డి వైసీపీలో చేరి..ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.

టీడీపీ నుంచి కిషోర్ కుమార్ పోటీ

టీడీపీ నుంచి కిషోర్ కుమార్ పోటీ

2014 తరువాత కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. కిషోర్ టీడీపీలో చేరటం కిరణ్ కు నచ్చలేదని కొందరు చెబితే..అన్నకు చెప్పిన తరువాతనే కిషోర్ టీడీపీలో చేరారని నియోజకవర్గంలో ప్రచారం. కిరణ్ మాత్రం టీడీపీకి దూరంగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.

రామచంద్రారెడ్డికి 7,874 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే సమయంలో తిరిగి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి తిరిగి వెళ్లిన వారిని సొంత గూటికి తీసుకొస్తానని అప్పట్లో చెప్పారు. కానీ, ఆయనే కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఇప్పుడు కిరణ్ కొన్ని ఆహ్వానాల్లో పాల్గొనేందుకు పీలేరు వచ్చారు.

మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా

మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంతో పాటుగా పీలేరులోనూ గెలుపు మంత్రి పెద్దిరెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఎలాగైనా గెలిచి మంత్రి పెద్డిరెడ్డికి షాక్ ఇవ్వాలనేది నల్లారి బ్రదర్స్ ఆలోచన.

అయితే, జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న పెద్దిరెడ్డికి ఈ రెండు నియోజకవర్గాలు కీలకంగా మారుతున్నాయి. అయితే, తమ్ముడికి దగ్గరగా.. టీడీపీకి దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాకీయంగా రానున్న ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, మంత్రి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చే విషయంలో మాత్రం కిరణ్ పూర్తిగా సహకరిస్తారనే విశ్లేషణలు మొదలయ్యాయి.బంగ్లాదేశ్​తో సిరీస్​.. టీమ్​ఇండియాకు భారీ షాక్​.. సీనియర్​ పేసర్​ దూరం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+