చిన్నాన హత్య కేసు పట్టించుకోని జగన్ కు అదో లెక్కా, మాజీ సీఎం రెడ్డి ఫైర్

గత వైసీపీ ప్రభుత్వం అరాచకాల గురించి వివరించాలంటే ఒకరోజు ఏమాత్రం సరిపోదని, గత అయిదు సంవత్సరాలు వైసీపీ చేసిన అరాచకాలు తలుచుకుంటే ప్రజలు భయపడి పోతున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జగన్ ఆయన సొంత చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించే పట్టించుకోలేదని, ఆయన ప్రజల గురించి ఏమి పట్టించుకుని ఉంటాడు చెప్పండి అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగంగా అన్నారు.

అనంతపురంలో బీజేపీ నాయకులతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పలు విషయాలపై చర్చలు జరిపారు. తరువాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ షాక్ నుండి ప్రజలు ఇంకా కోలుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Ex CM Kiran Kumar Reddy sensational comments about Vivekananda murder case
అయితే రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని వైసీపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళు మర్చిపోలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వైసీపీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తారని, అమరావతిని రాజధానిగా నిర్మిస్తారని, చంద్రబాబు సమర్థవంతమైన పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకరిస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Ex CM Kiran Kumar Reddy sensational comments about Vivekananda murder case

పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ జిల్లాలోని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని, రైతుల కష్టాలు తీరిపోతాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాల పునర్విభజన కారణంగా ప్రజలకు ఎలాంటి మేలు జరగదని, తాను సీఎం అయి ఉంటే విభజించిన జిల్లాలను మళ్లీ కలిపేసే వాడినని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

జగన్ నిర్లక్ష్య ధోరణి వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నష్టపోయారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జగన్ ఐదు సంవత్సరాలు సీఎం గా ఉన్నారని, ఆయన సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును చేధించలేక పోయారని, ఇక ప్రజలకు ఏం న్యాయం చేసి ఉంటాడో అనే విషయం ప్రజలే అర్థం చేసుకోవాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవ్వరూ తప్పించుకోలేరని, చట్టపరంగా అందరికీ శిక్ష పడుతుందని మాజీ సీఎం, బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+