భేతాళ, విక్రమార్క కథలా లిక్కర్ కేసులో చార్జ్ షీట్ల కథ!

సిట్ దర్యాప్తు చందమామ కథలో భేతాళ, విక్రమార్కుడు తీరులా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లిక్కర్ కేసులో ప్రభుత్వ అరెస్టులు, సిట్ ఛార్జ్ షీట్ లపై మాజీ మంత్రి అంబటి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు లిక్కర్ కేసు ఒక రాజకీయకక్ష అని అన్నారు.

సిట్ ఎల్లో మీడియా కథనాలే సాక్ష్యాలుగా చార్జ్ షీట్ లు
ఈ కేసులో ఇంతవరకు ఒక్క ఆధారం చూపించలేని సిట్ ఎల్లో మీడియా కథనాలే సాక్ష్యాలుగా చెప్తుందని అన్నారు. వైయస్సార్సీపీ నేతల అరెస్టే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో రాక్షసానందం పొందుతున్న కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు పేరుతో రాద్దాంతం చేస్తుందన్నారు. అరెస్టైన నేతలను సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కుట్ర లో భాగంగా వరుస ఛార్జ్ షీట్ లు వేస్తున్నారని అన్నారు.

ex minister ambati rambabu targets chandrababu and ap govt over liquor case charge sheets

జగన్ కు సన్నిహితంగా ఉంటే కేసులు
లిక్కర్ కేసులో కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎల్లో మీడియా కథనాలే సిట్ ఛార్జ్ షీట్ లుగా మారాయని ఆయన ఆరోపించారు. వైయస్.జగన్ కు అండగా ఉన్నందునే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని, ముద్దాయిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సజ్జల భార్గవ

బేతాళ విక్రమార్కుడు కథలా లిక్కర్ కేసు కథ
చందమామ కథల పుస్తకం ఉన్నంత కాలం ఈ బేతాళ విక్రమార్కుడు కథ నడుస్తూనే ఉంటుంది. అదే తరహాలో లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ కథ కూడా అలాగే నడుస్తోంది. ఛార్జ్ షీట్ ల మీద ఛార్జ్ షీట్ లు వేసుకుంటూ వెళ్తున్నారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటన్నది రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్దం అవుతుందన్నారు. భారత రాజకీయాల్లో ఈ రకంగా దౌర్భాగ్యమైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు సవాల్ పై భగ్గుమన్న అంబటి రాంబాబు
తప్పుడు కేసులతో వైయస్సార్సీపీని అప్రతిష్ట పాలుజేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.2014-19లో జరిగిందే అత్యంత దారుణమైన లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్నాడు. మమ్నల్ని దమ్ముంటే అసెంబ్లీకి రండి అని సవాల్ చేస్తున్న చంద్రబాబు ఆ రోజు ఏడ్చి మరీ అసెంబ్లీ నుంచి పారిపోయాడన్నారు. అలాంటి చంద్రబాబా మమ్నల్ని సవాల్ చేసేది అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన కేసులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనుకోవడం అసాధ్యం. కూటమి ప్రభుత్వ అబద్దాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.ఎన్నికేసులు పెట్టినా వైయస్సార్సీపీ వెనక్కి తగ్గదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+