మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ కన్నుమూత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబుఖాన్(73)ఆదివారం కన్నుమూశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాబుఖాన్ గత కొంతకాంగా అనా రోగ్యంతో భాధ పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో, ఆ తరువాత చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో బషీరుద్దీన్ బాబుఖాన్ అనేక మంత్రి పదవులు నిర్వహించారు.
ఉన్నత విధ్యాశాఖ మంత్రిగా, భారీ పరిశ్రమలు, పర్యాటక శాఖలతో పాటు, మైనార్టీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఎన్టీర్‌కు, చంద్రబాబు నాయుడుకు బషీరుద్దీన్ బాబుఖాన్ చాలా విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 1998లో బాబుఖాన్ టిడిపికి రాజీనామా చేశారు. టిడిపి పార్టీ క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

సంతాపం తెలిపిన చంద్రబాబు‚
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబుఖాన్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్ర సంతాపం తెలియ చేశారు. బషీరుద్దీన్ బాబుఖాన్ టిడిపి ప్రభుత్వంలో మంత్రిగానే కాకుండా, అనేక సాంఘీక, థార్మిక సేవా కార్య క్రమాల్లో చురుకుగా పాల్గొనే వాడని చంద్రబాబు కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజమైన పేదవారికి అందించేలాగా కృషి చేశాడని బాబు శ్లాఘించారు.
ముఖ్యంగా మైనార్టీ నిధులను ఏమాత్రం దుర్వినియోగం కాకుండా వినియోగించి, వారి అభివృద్ధికి పాటుపడి, వారి ఆధరాభిమానాలు పొందాడని తెలిపారు. బాబుఖాన్ మృతి బడుగు, బలహీన వర్గాలవారికి తీరని లోటని బాబు తెలిపారు. బషీరుద్దీన్ బాబుఖాన్ కుటుంబా నికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేేశారు.
మండవ సంతాపం
బషీరుద్దీన్ మృతి పట్ల మాజీ మంత్రి మండవ వెం టేశ్వరావు సంతాపాన్ని తెలియజేశారు. బషీరుద్దీన్ బాబు ఖాన్ తనతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీర్, చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో సహ మంత్రిగా పనిచేశారని తెలిపారు.












Click it and Unblock the Notifications