శ్రీసిటీలో చంద్రబాబు ప్రారంభోత్సవాల హైడ్రామా.. మాజీమంత్రి ఘాటువ్యాఖ్యలు!

ఈరోజు తిరుపతిలో చంద్రబాబు సినిమా చూసి షాకయ్యామని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. గత వైసీపీ పాలనలోనే శ్రీసిటీలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని పేర్కొన్న ఆయన , ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే
ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు చేశారని, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొని చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటన్నారు. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని సెటైర్లు వేశారు.

ex minister gudivada amarnath sensational comments on chandrababu sricity inaugurations

చంద్రబాబు ప్రారంభించిన కంపెనీలు వైసీపీ హయాంలో వచ్చినవి
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కంపెనీలు ప్రారంభోత్సవాలు ఎలా చేసుకుంటాయని ప్రశ్నించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన, ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కావని స్పష్టం చేశారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ క్రెడిట్ అన్నారు.

తాము ప్రారంభించిన వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు
విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని, ఇప్పుడు వాటిని చంద్రబాబు తానే చేసినట్టు తన ఖాతాలో వేసుకుంటున్నారని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. గతంలో తాము ప్రారంభించిన వాటినే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ, ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

చంద్రబాబు చేస్తున్న డ్రామాకు నాటి ఎంఓయూలు సాక్ష్యాలు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్‌ సంక్షోభం ఉన్నా, 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్‌ నిర్వహించి, 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంవోయూలు సాక్ష్యాలని తేల్చి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నిటికి తమ హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయని, మరికొన్నింటికి భూసేకరణ జరిగిందన్న గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు గుడివాడ అమర్ నాథ్ హితవు
ఇకనైనా ప్రచార ఆర్భాటం వదిలి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, వేరొకరి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోవడం చెయ్యకుండా ఉండాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హితవు పలికారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+