Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం గెజిట్ రాయలసీమ ప్రాజెక్ట్ లకు గొడ్డలి పెట్టు, జగన్ తీరుపై మాజీ మంత్రి ఎం.వి. మైసూరా రెడ్డి ధ్వజం

కృష్ణా గోదావరి నదీజలాల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ రెండు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతోంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం విరుచుకు పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గెజిట్ విషయంలో కక్కలేక మింగలేక, బయటకు మాట్లాడలేని స్థితిలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల లోనూ నదీజలాల హక్కులను కాలరాస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కేంద్రం గెజిట్ పై హాట్ కామెంట్స్ చేసిన ఎం.వి.మైసూరా రెడ్డి

కేంద్రం గెజిట్ పై హాట్ కామెంట్స్ చేసిన ఎం.వి.మైసూరా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తెలంగాణా జలచౌర్యం పై ఫిర్యాదు చేయడంతో పాటుగా కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరడంతో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన కేంద్రం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇక దీనిపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఎం.వి.మైసూరా రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ పై హాట్ కామెంట్స్ చేశారు.

 రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టుగా గెజిట్

రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టుగా గెజిట్

ఈ గెజిట్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాయలసీమ ఏపీలో అంతర్భాగమా కాదా అన్నది సీఎం జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గెజిట్ ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. పోలవరంపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుతున్న సమయంలో కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేరా అంటూ ప్రశ్నించారు.

రాజకీయ లబ్ది కోసం ఇరు రాష్ట్రాల సీఎంల ఘర్షణ

రాజకీయ లబ్ది కోసం ఇరు రాష్ట్రాల సీఎంల ఘర్షణ

కృష్ణా జలాల వివాదం ఏపీ సమగ్రతకు మంచిదికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇద్దరు సీఎంలు రాజకీయ లబ్ధి కోసం ఘర్షణ పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసిన మైసూరా రెడ్డి కేంద్రం చేతిలో రెండు రాష్ట్రాలు జల వివాదం పెట్టాయని అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి మూడు టీఎంసీల నీరు మాత్రమే వినియోగించాలని ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఎం.వి.మైసూరారెడ్డి నిలదీశారు.

 రాయలసీమకు ఒక ప్రభుత్వం ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు

రాయలసీమకు ఒక ప్రభుత్వం ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు


రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండి ఉంటే రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడక పోవడం వల్లే కేంద్రం జోక్యం చేసుకుందని, రాజకీయ లబ్ధి కోసం కీచులాడుకుని జుట్టుని కేంద్రం చేతిలో పెట్టారని ఎం.వి.మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన ఆయన, గతంలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు.

రాయలసీమ ప్రాజెక్ట్ ల కోసం ఏపీ ఎందుకు పోరాటం చెయ్యటం లేదు

రాయలసీమ ప్రాజెక్ట్ ల కోసం ఏపీ ఎందుకు పోరాటం చెయ్యటం లేదు

విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టం వచ్చినట్లుగా నీటిని తోడేస్తే రెండు రాష్ట్రాలకు ఇబ్బందే అని ఎం.వి.మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేయడం లేదని ప్రశ్నించిన ఆయన ఈ పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.గ్రేటర్ రాయలసీమ ఒక రాష్ట్రం అయితే ఈ నష్టం జరిగేది కాదన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని, రాయలసీమలో స్వీయ పరిపాలన ఉండాలని ఆకాక్షించిన వారిలో ఎం.వి.మైసూరా రెడ్డి ఒకరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+