ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారా చంద్రబాబు!!

విద్య వైద్యం కోసం పేదవాడు మళ్ళీ అప్పలపాలయ్యే దుస్థితి తీసుకురావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాల పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని, ప్రజలు అదే ఆందోళనలో ఉన్నారని సీదిరి అప్పలరాజు తెలిపారు.

రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి: సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన సంపదను సృష్టిస్తానన్న నోటితోనే చంద్రబాబు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చెప్పడం సరికాదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. రైతు భరోసా, అమ్మబడి, మత్స్యకార భరోసా, చేయూత నిధులపై స్పష్టత ఇవ్వాలని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మే, అక్టోబర్, జనవరి మాసాల్లో రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేవారని మాజీమంత్రి గుర్తు చేశారు.

Ex minister seediri appalaraju questioned is Chandrababu conspiring to evade Super Six promises

రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ
గత ప్రభుత్వం పెట్టుబడుల కోసం రైతులు ఎవరి నుంచి సాయం ఆశించకుండా నేరుగా పెట్టుబడి సాయం చేసిందని పేర్కొన్నారు .ఇక చంద్రబాబు ప్రతి రైతుకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రైతు భరోసా కు పేరు మార్చి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కానీ రైతాంగానికి న్యాయం జరగటమే కావాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారన్నారు.

వారికి మాత్రమే తల్లికి వందనం ఇస్తామని లీకులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే తల్లికి వందనం డబ్బులు ఇవ్వాలని కొన్ని లీకులు ఇస్తున్నారని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులలో భయాందోళనలు ఏర్పడుతున్నాయని అన్నారు. జగన్ హయంలో ఏ పథకం ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ఇచ్చామని పేర్కొన్న ఆయన చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల అమలు పైన కూడా క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Ex minister seediri appalaraju questioned is Chandrababu conspiring to evade Super Six promises

సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల క్యాలెండర్ ఎక్కడ
సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన చరిత్ర జగన్ కు ఉందని, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా త్వరలో క్యాలెండర్ విడుదల చేయాలని సీదిరి అప్పలరాజు సూచించారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు అప్పులు అయిపోతాయని, రాష్ట్రం శ్రీలంక, వెనుజులా అయిపోతుందని, ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతారన్న మీరే కానీ ఇంతకు మించిన సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ రూపంలో హామీలిచ్చారన్నారు. శ్వేత పత్రాల పేరుతో సూపర్ సిక్స్ పేరుతో ఎగ్గొట్టే కుట్రలు చెయ్యొద్దని ఆయన హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+