కోడెల అంగీకరించారు..కానీ: ఆ కారణాలు ఫన్నీగా అంటూ.. టీడీపీలోనూ దొరకని మద్దతు..!!

మాజీ స్పీకర్ కోడెల రాజకీయంగా వైసీపీకి దొరికిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ వ్యూహాత్మకంగా కోడెలను డామేజ్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో ఆయన ఇచ్చిన వివరణ మరింత ఇబ్బంది కరంగా మారింది. సొంత పార్టీ నేతలే కోడెల ఇచ్చిన సమాధానం పైన సీరియస్ అవుతున్నారు. ఆయన చేసినది తప్పు అంటూ అంగీకరిస్తున్నారు. సొంత పార్టీ నుండి కోడెలకు మద్దతు లభించటం లేదు. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన క్యాంపు కార్యాలయానికి తరలించామని చెప్పటం ద్వారా..కోడెల చేసింది ఒప్పుకున్నా..అది తప్పేనని ీడీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఇదే సమయంలో తాను ఫర్నీచర్ తీసుకెళ్లమని లేఖ రాసానని..లేదంటే ఎంతో చెబితే ఇచ్చేస్తానని చేసిన వ్యాఖ్యలు మరింత ఫన్నీగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు సొంత పార్టీలోనూ కోడెల ఇచ్చిన వివరణ మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కోడెల అంగీకరించారు..ఆ వాదన మీదనే

కోడెల అంగీకరించారు..ఆ వాదన మీదనే

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఎన్నికల సమయం నుండి సమస్యల్లో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో మొదలైన వ్యతిరేకత..కుటుంబ సభ్యుల మీద వెల్లువెత్తుతున్న ఆరోపణలు.. తాఆ గా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో కోడెల పొలిటికల్ గా డామేజ్ అయ్యారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారం పైన వైసీపీ వ్యూహాత్మకంగా మీడియాకు లీక్ చేసిది. దీని పైన అసెంబ్లీ కార్యదర్వి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు కాకున్నా..అంతర్గతంగా విచారణ చేసారు. అయితే, మాజీ స్పీకర్ కోడెల మీడియా ముందుకొచ్చారు. అసెంబ్లీ ఫర్నీచర్ తన క్యాంపు కార్యాలయంలో వినియోగించటం కోసం తీసుకెళ్లామని అంగీకరించారు. అయితే, ప్రభుత్వం మారగానే ఆ ఫర్నీచర్ ను తీసుకెళ్లమని తాను అసెంబ్లీకి లేఖ రాసానని వివరణ ఇచ్చారు. ఇప్పటికైన ఫర్నీచర్ తీసుకెళ్లాలని..లేకుంటా దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని వివరణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు సమస్యకు కారణమైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తరలించారనే ఆరోపణలు..దానిని స్వయంగా అంగీకరించటం.. అర్దం పర్దం లేని వివరణలు ఇవ్వటం పైన సొంత పార్టీ నేతలే తప్పు బడుతున్నారు. పార్టీ నేత వర్ల రామయ్య తప్పు ఎవరు చేసిన తప్పేనంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ క్షక్ష్య సాధిస్తుందంటూ..

వైసీపీ క్షక్ష్య సాధిస్తుందంటూ..

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మాత్రం అధికార పార్టీ తన పైన రాజకీయంగా క్షక్ష్య సాధించేందుకు వేధింపులు మొదలు పెట్టిందని ఆరోపిస్తున్నారు. తాను వైసీపీ నుండి టీడీపీ లో చేరిన 23 మంది పైన అనర్హత వేటు వేయని కారణంగానే..తనను ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని కోడెల అంటున్నారు. తాను స్పీకర్ గా నిష్పాక్షపాతంగా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ మందిరం లాంటి దని..తాను అందులో పూజారిలా వ్యవహరించానని వివరించారు. అయితే, అసెంబ్లీ గుడి లాంటిదని..తాను పూజారి లాంటి వాడినని చెప్పిన కోడెల..గుడి లోని కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకెళ్లారని వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాజాగా కోడెల కుమారుడివిగా చెబుతున్న ద్విచక్ర వాహనాల షోరూంలో పన్నులు చెల్లించకుండా విక్రయిస్తున్న వాహనాల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో.. కోడెల కుమారిడికి సంబంధం ఉన్నట్లుగా చెడుతున్న ద్విచక్ర వాహన షోరూంలను అధికారులు సీజ్ చేసారు. కోడెల కుమారుడు..కుమార్తె మీద ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే, వైసీపీ నేతలే ఈ ఫిర్యాదులు చేయిస్తున్నారని కోడెల చెబుతున్నారు.

టీడీపీలోనూ దొరకని మద్దతు

టీడీపీలోనూ దొరకని మద్దతు

అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల పైన జాతీయ మీడియాలోనూ అనేక కధనాలు వచ్చాయి. కోడెల చెబుతున్న కారణాలు ఫన్నీగా ఉన్నాయంటూ నేషనల మీడియా కామెంట్ చేస్తోంది. ఇదే వ్యవహారం పైన టీడీపీలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల తీరును సొంత పార్టీ నేతలే తప్పు బడుతున్నారు. అసలు స్పీకర్ గా ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఆస్తిని తన క్యాంపు కార్యాలయానికి తరలించటం ఏంటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అందునా..ఆయన డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పటం మరింత ఫన్నీగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా రాజకీయంగా సమస్యల్లో చిక్కుకున్న కోడెలకు సొంత పార్టీ నుండి కూడా మద్దతు లేకపోవటంతో..వైసీపీ నేతలు మరింతగా టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+