ఏపీలో ఆ మహిళలకు అద్భుతమైన పథకం.. 10లక్షలకు 2లక్షలు చెల్లిస్తే చాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. డ్వాక్రా మహిళల ఆర్థిక అభ్యున్నతికి రకరకాల చర్యలు చేపడుతున్న ఏపీ సర్కార్ మరోవైపు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి ప్లాన్ చేసింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి వినూత్న పథకాన్ని అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపైన డ్రోన్లను అందించనుంది.

డ్వాక్రా మహిళలకు డ్రోన్ల పథకం
తద్వారా వారి అభ్యున్నతికి, వ్యవసాయ రంగ పురోగతికి దోహదం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రాయితీ పైన డ్రోన్లను అందించే పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో డిఆర్డిఏ అధికారులు తలమునకలవుతున్నారు. ఈ పథకం కింద 10లక్షలు విలువచేసే డ్రోన్ డ్వాక్రా గ్రూపు మహిళలకు రాయితీపై అందిస్తారు. మొత్తం 80శాతం రాయితీతో కేవలం రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోయే విధంగా ఈ పథకాన్ని అందిస్తున్నారు.

excellent scheme for shg women Just pay 2 lakhs for 10 lakhs for drones scheme

డ్రోన్ ల వినియోగంపై డ్వాక్రా మహిళలకు శిక్షణ
ఇక ఈ డ్రోన్ల కొనుగోలు కోసం శ్రీనిధి లేదా వాలంటరీ ఆర్గనైజేషన్ ల ద్వారా రుణాలను పొందవచ్చు. ఈ డ్రోన్లను మహిళలకు ఇవ్వడమే కాకుండా, వాటిపైన వారికి శిక్షణ కూడా ఇచ్చి వ్యవసాయ రంగంలో వాటి వాడకాన్ని ప్రోత్సహించనున్నారు.వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

లబ్దిదారులకు 15 రోజుల శిక్షణ
ఈ డ్రోన్ల పథకాన్ని వర్తింపజేయాలని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. వారి కుటుంబ సభ్యులకు డ్రోన్ మెకానిక్ లుగా ఐదు రోజుల శిక్షణ ఇస్తారు. చిన్న చిన్న రిపేర్లు వారే స్వయంగా చేసుకునేలా తర్ఫీదును ఇస్తారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు సమయాన్ని ఆదా చేస్తుంది. అంతేకాదు వివిధ రకాల పురుగు మందుల వల్ల రైతులకు కలిగే ఆరోగ్య అనర్థాలను నివారిస్తుంది.

డ్రోన్ ల వినియోగంతో రైతులకు లాభాలు
డ్రోన్ ల వినియోగం వలన ఔషధాల వృధా తగ్గిపోతుంది. ఒక ఎకరం పొలానికి కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల లోనే పురుగు మందులు పిచికారీ చేయవచ్చు. ప్రతిరోజు రైతులు డ్రోన్లను ఎనిమిది గంటల వరకు వినియోగించుకోవచ్చు అంతేకాదు ఇతరులకు అద్దెకు ఇవ్వడం వల్ల కూడా అదనంగా ఆదాయాన్ని పొందవచ్చు.

మహిళలకు ఉపాధి, రైతాంగానికి లబ్ది
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇలా డ్రోన్ల వినియోగం పైన ట్రైనింగ్ ఇచ్చి, డ్రోన్లను అందించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. ఈ ఆలోచనతోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను డ్రోన్ల పథకం కోసం ఎంపిక చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+