మద్యం అమ్మకాల పై అనూహ్య నిర్ణయం - ఇక కొత్తగా...!!
మద్యం అమ్మకాలు.. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ అధికారులు వరుస నిర్ణయాలు తీసు కొంటున్నారు. ఇప్పటికే ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు చేస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరల పెంపు పైన ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడ లేదు. ఇదే సమయంలో బార్ల విషయం లో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది.
తాజా నిర్ణయంతో
ఏపీలో ఎక్సైజ్ శాఖ తాజాగా రాష్ట్రంలో 44 బార్లకు ఈ-వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లిం చని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44 బార్లను ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్ధ తిలో కేటాయిస్తారు. బార్ల లైసెన్సులు తీసుకునేందుకు ఆసక్తి గల వారు ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7తో ఈ ప్రక్రియ ముగుస్తుంది, అదే విధం గా.. అభ్యర్థులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.

జనాభా ఆధారంగా
50వేల జనాభా ఉంటే రూ.5 లక్షలు, 50వేలు- 5 లక్షల జనాభా వరకు రూ.7. 5లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.10లక్షలుగా దరఖాస్తు రుసుములు నిర్ణయించారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ కేటాయిస్తారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్ సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలు ఎక్సైజ్ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇటు తెలంగాణలోనూ డిఫంక్ట్(నాన్ రెన్యూడ్) అయిన 40 బార్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆ ప్రాంతంలో మినహా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల 25 బార్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.
ఫీజుల ఖరారు
ఇందు కోసం దరఖాస్తు రుసుం రూ.లక్ష చొప్పున నిర్ణయించి.. ఈ నెల 26వ తేదీ వరకు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. ఒక్కో బార్‌కు అక్కడి రాబడి ఆధారంగా చేసుకుని రూ.30 నుంచి రూ.44 లక్షల వరకు సంవత్సరం ఫీజు నిర్ణయించారు. ఇలా ఏడాదికి రూ.10 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా. ఆయా బార్లలో మద్యం, బీర్ల అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువే ఉంటుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2025-26లో రూ.27,623 కోట్ల ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి గత ఏడాదికంటే దాదాపు రూ.2 వేల కోట్ల వరకు అదనంగా లక్ష్యం నిర్ణయించారు. ఇటీవల బీర్ల ధరలు పెంచడంతో ప్రతి నెలా దాదాపు రూ.170 కోట్లకుపైగా ఆదాయం పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా రాష్ట్రంలో అమ్మకాలు లేని దేశ, విదేశీ లిక్కర్, బీరు కంపెనీలు తమ బ్రాండ్ల మద్యం విక్రయించుకోవడానికి టీజీబీసీఎల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది.












Click it and Unblock the Notifications