ఒక్క సమీకరణం ఫలితం మార్చేసింది - ఆశలపై నీళ్లు...!!
ఏపీలో ఎవరికెన్ని సీట్లు. అధికారం దక్కేదెవరికి. ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ రోజు విడుదల అవుతున్న ఎగ్జిట్ పోల్స్ పైన పార్టీల్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పోలింగ్ సరళి పైన జగన్..చంద్రబాబు ఇద్దరూ క్షేత్ర స్థాయి నుంచి పూర్తి సమాచారంతో కసరత్తు చేసారు. జిల్లాల వారీగా ఫలితాల పై అంచనాకు వచ్చారు. గతంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన జిల్లాల్లో మార్పు కనిపిస్తోందని తేల్చారు.
జగన్ ధీమా వెనుక
ఏపీ ఎన్నికల్లో తిరిగి అధికారం రావటం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారు. 2019 లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా ఉన్నారు. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కవ వస్తాయని జగన్ పార్టీ నేతలతో జరిగిన సమీక్షల్లోనూ చెబుతున్నారు. ఇందుకు గల కారణాలను జగన్ కోసం పని చేసిన ఐప్యాక్ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్షాలకు అనుకూలమని ప్రచారం సాగుతోంది. దీని పైన జగన్ వద్ద జరిగిన సమీక్షలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ తోనే తిరిగి అధికారంలోకి వస్తున్నామని జగన్ విశ్వాసం వ్యక్తంతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

అక్కడే మెజార్టీ
పోలింగ్ సరళి గమనించిన తరువాత వైసీపీ నేతలు పూర్తిగా ఒక అంచనాకు వచ్చారు. జగన్ అమలు చేసిన సంక్షేమం ఓటుగా మారిందని చెబుతున్నారు. అదే విధంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే అంచనాతో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి విశాఖ జిల్లాల వరకు కూటమికి పైచేయిగా ప్రచారం సాగుతున్నా..పోలింగ్ మాత్రం భిన్నంగా జరిగిందనే అంచనాలతో జగన్ కోర్ టీం విభేదిస్తోంది. ఈ అయిదు జిల్లాల్లో పోటీ పోటీగా సీట్లు దక్కించుకుంటారనే అంచనాలు ఉన్నా.. తూర్పు గోదావరిలో మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ, విశాఖలో మాత్రం కొంత తగ్గే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెప్పినట్లు సమాచారం.
మారిన సమీకరణాలు
అయితే, జగన్ మాత్రం తాను తొలి నుంచి చెబుతున్న లెక్క పైనే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం అవుతతోంది. ఇదే సమయంలో సర్వేలు చేసిన సంస్థలు కామన్ గా ఒక అంశాన్ని ప్రస్తావించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతం పూర్తిగా వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పేద వర్సస్ ధనిక అన్నట్లుగా పోలింగ్ లోనూ సరళి కనిపించిదని పలువురు విశ్లేషిస్తున్నారు. దీంతో..జగన్ పెత్తందార్లు వర్సస్ పేదలు అనే నినాదంతో సాగించిన ఎన్నికల ప్రచారం...సామాజిక లెక్కలు..సంకేమం పూర్తిగా తమకు కలిసి వచ్చిందనేది వైసీపీ నమ్మకంగా ఉంది. దీంతో.. ఎన్నికల ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications