వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీ

Exit polls surveys, Exit Poll 2019, Exit Polls results 2019, Exit poll 2019 India latest, Exit Poll, Lok Sabha Election Exit Poll,AP elections 2019,YCP ,will win, Jagan CM, happy mood, josh, ycp ఎగ్

Recommended Video

    Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీ ! || Oneindia Telugu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని దాదాపు చాలా జాతీయ సర్వేల ఫలితాలు తేల్చేశాయి .లగడపాటి సర్వే , ఐఎన్ఎస్ఎస్ సర్వే, ఎలైట్ సర్వేలు మినహాయించి దాదాపు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ అనూహ్యమైన విజయం వైసీపీ సాధిస్తుందని చెప్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపి కన్నా ఎక్కువ సీట్లుసాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలుతెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. వైసీపీ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిపిఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలుగుదేశం పార్టీకి 37, వైసిపికి 130 నుంచి 133 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి అని ప్రకటించింది . టీడీపికి 47, వైసిపికి 126, జనసేనకు 2 సీట్లు వస్తాయని ఆరా సర్వే తేల్చింది. కేకే సర్వే ప్రకారం... టీడీపికి 30 నుంచి 35 సీట్లు, వైసిపికి 130 నుంచి 135 సీట్లు, జనసేనకు 10 నుంచి 13 సీట్లు వస్తాయి. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... టీడీపికి 58, వైసిపికి 98, జనసేనకు 7 సీట్లు వస్తాయి. ఐఎన్ న్యూస్- ఐ పిల్స్ సర్వే ప్రకారం... టీడీపికి 55 నుంచి 62 సీట్లు, వైసిపికి 110 నుంచి 120 సీట్లు, జనసేనకు 3 సీట్లు వస్తాయి. విడీపి అసోసియేట్స్ సర్వే ప్రకారం... టీడీపికి 54 నుంచి 60, వైసిపికి 111 నుంచి 121 సీట్లు, జనసేనకు 0 నుంచి 4 సీట్లు వస్తాయి అని ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. టీడీపికి 49, వైసిపికి 116, జనసేనకు 2 సీట్లు వస్తాయని పోల్లాబ్ ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది.

    లోక్ సభ ఎన్నికల్లో 18 నుండి 20స్థానాలు వైసీపీ ఖాతాలోకే అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

    లోక్ సభ ఎన్నికల్లో 18 నుండి 20స్థానాలు వైసీపీ ఖాతాలోకే అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

    లోకసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. టైమ్స్ నౌ - విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.... వైసిపికి 18 లోకసభ స్థానాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ 7 స్థానాలకే పరిమితమవుతుంది. బిజెపి తన రెండు సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్, మైనేత సర్వేలు వైసిపికి 20 స్థానాలు, టీడీపికి 5 స్థానాలు వస్తాయని తేల్చాయి. రాష్ట్రంలోని 25 స్థానాల్లో వైసిపికి 18 నుంచి 20 స్థానాలు వస్తాయని ఇండియా టుడే - ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది.రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు, వైసిపికి 13 నుంచి 16 సీట్లు వస్తాయి.

    దాదాపు సర్వేలన్నీ వైసీపీ వైపే ... కొన్ని సర్వేలే టీడీపీకి అనుకూలం

    దాదాపు సర్వేలన్నీ వైసీపీ వైపే ... కొన్ని సర్వేలే టీడీపీకి అనుకూలం

    ఐఎన్ఎస్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... టీడీపికి 118, వైసిపికి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయి. ఎలైట్ సర్వే ప్రకారం... టీడీపికి 106 సీట్లు, వైసిపికి 68 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి. ఇక లగడపాటి సర్వేలో ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ తిరిగి వంద సీట్ల‌తో అధికారం నిల‌బెట్టుకుంటుంద‌ని లగ‌డ‌పాటి స్ప‌ష్టం చేసారు. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి వంద సీట్లు, వైసీపీకి 72 సీట్లు, జ‌న‌సేన‌కు రెండు సీట్లు వ‌స్తాయ‌ని ల‌గ‌డ‌పాటి త‌న ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

    వైసీపీలో పండుగ వాతావరణం.. జోష్ లో జగన్ .. జగనే సీఎం అంటున్న శ్రేణులు

    వైసీపీలో పండుగ వాతావరణం.. జోష్ లో జగన్ .. జగనే సీఎం అంటున్న శ్రేణులు

    మొత్తంమీద, ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ జగన్ కు అనుకూలంగా వచ్చాయి. దీంతో అంతిమ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో వైసిపి శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనన్న ధీమాలో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని తాగా ఎగ్జిట్ పోల్స్ చెప్పటంతో వైసీపీలో సంతోషం పట్టరాకుండా వుంది. వైసీపీ వైపే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీ లో ఒక పండుగ వాతావరణం తెచ్చి పెట్టాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+