తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో అదే ప్రధాన ఆకర్షణ..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్నాయి. నేడు పెద్దశేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి, సింహవాహనం, 20న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21న పల్లకీ ఉత్సవం, గజవాహనం, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణ రథోత్సవం, గరుడవాహన సేవలను నిర్వహిస్తారు. 23 సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీతీర్థం ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉంటాయి.
ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన ఆయనను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తొలి రోజున పద్మావతి అమ్మవారు పరమ వాసుదేవుడి అలంకారంలో చిన శేషవాహనంపై దర్శనం ఇచ్చారు. భక్తులను కటాక్షించారు. ఈ వేడుక కన్నులపండువగా సాగింది. తెలంగాణ నుండి గుస్సాడి, బతుకమ్మ, చెక్కభజనలతో సాంస్కృతిక కార్యక్రమాలు వేలాదిమంది భక్తులను అలరించాయి. కళాకారులు ప్రదర్శించిన అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ పూలతో తిరుచానూర్ లో తెలంగాణ వాతావరణం కనిపించింది.
తిరుపతి శ్రీవేంకటేశ్వర మ్యూజిక్ కాలేజీకి చెందిన విద్యార్థులు నుండి కత్తి నాట్యాన్ని ప్రదర్శిరంచారు. రాజమహేంద్రవరం నుండి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నెమలి డ్యాన్స్ భక్తులను కట్టిపడేసింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు కోలాటం, కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుండి సాంప్రదాయ పాఠశాల కళాకారులు దీపలక్ష్మీ నృత్యం, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి విజయవాడ కు చెందిన కోలాటం, కర్ణాటక నుండి పద్మావతీ కల్యాణం భరత నాట్యం ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications