సబ్ కలెక్టర్ ఆఫీసు దెబ్బ, అసలు అగ్నిప్రమాదమే జరగలేదని చంద్రబాబుకు నివేదిక
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిిన అగ్నిప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన అగ్నిప్రమాదం జరగలేదని, అసలు ఇది ప్రమాదం కాదని, కావాలనే కార్యాలయంలోని ఫైళ్లకు నిప్పంటించారని నిపుణులు తేల్చేశారు. విద్యుత్ శాఖ నిపుణులు దర్యాప్తు చేసి ఇది విద్యుత్ షార్ట్ సర్కూట్ కాదని తేల్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకాలం ఈ కేసు నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న నిందితులకు ఈ నివేదికతో నోట్లో ఎలక్కాయ పడినట్లు అయ్యిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు చేసిన విద్యుత్ శాఖ నిపుణులు మీటర్ రీడింగ్ ఇన్ స్ట్రుమెంట్ (ఎంఆర్ఐ) సర్వర్ డేటాను పరిశీలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన మూడు రోజులు ముందు నుంచి ఎంఆర్ఐ డేటాను అధికారులు సేకరించారు.

ప్రతి సర్వీసుకూ 15 నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే వివరాలు మొత్తం ఎంఆర్ఐ సర్వర్ లో ఉంటాయని. అగ్నిప్రమాదం జరిగిన రోజు, ఆంతకు మూడు రోజుల ముందు నుంచి ఎప్పుడుకాని ఓవర్ లోడ్ విద్యుత్ సరఫరా లేదని, మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయ్యే అవకాశం లేదని, ఎంఆర్ఐ సర్వర్ ను క్షణ్ణంగా పరిశీలించామని సంబంధిత నిపుణులు తేల్చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి త్రీఫేజ్ విద్యుత్ సర్వీసు ఉందని, ఆ వైర్ కూడా ఎక్కడా దెబ్బతినలేదని నిపుణుల పరిశీలనలో, దర్యాప్తులో వెలుగు చూసిందని డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్ లో ఈనెల 21వ తేదీన రాత్రి 11.24 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం మంటలు వ్యాపించిన 15 నిమిషాల ముందు, మంటలు వ్యాపించిన15 నిమిషాల తరువాత విద్యుత్ యాంప్స్ లోడ్ డేటాను పరిశీలించారు. ఎక్కడకూడా ఓవర్ లోడ్ విద్యుత్ సరఫరా అయ్యిందని ఎంఆర్ఐ సర్వర్ లో నమోదు కాలేదని, మూడు రోజుల ముందు నుంచి కూడా ఎక్కడా విద్యుత్ హెచ్చుతగ్గులు సరఫరా అయినట్లు సర్వర్ లో నమోదు కాలేదని డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం నిపుణులు తేల్చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, అదో ఇన్సిడెంట్ అని విద్యుత్ శాఖ నిపుణులు తేల్చేయడంతో ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తడిచిపోతా ఉందని సమాచారం. విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వెంటనే సీఐడీ అధికారులను రంగంలోకి దింపుతుందా ? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications