పవన్‌తో సమస్యే లేదు: కర్ర విరగకుండా చంద్రబాబు వ్యవహారం?

Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.

ఉత్తరాదికే లబ్ది..

ఫలితంగా అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాజకీయంగా ఎంతగానో లబ్దిపొందుతాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూ వస్తోన్నారాయన కొంతకాలంగా.

Pawan Kalyan

సీట్లు ఇలా..

లోక్‌ సభలో మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129. అంటే 24 శాతం. తెలంగాణ- 17, ఏపీ- 25, కేరళ- 20, తమిళనాడు- 39, కర్ణాటక- 28 స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 753కు పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న 24 నుంచి 19 శాతానికి పడిపోతుంది.

డీలిమిటేషన్ తరువాత..

డీలిమిటేషన్ తరువాత తెలంగాణ- 20, ఏపీ- 28, తమిళనాడు- 41, కర్ణాటక- 36 వరకు సీట్లు పెరుగుతాయి. కేరళలో ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 20 నుంచి 19కి పడిపోయే అవకాశం ఉంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమితంగా ఉంటోంది. ఇదే ప్రాతిపదిక కావడం వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌ సభ సీట్ల సంఖ్య పెరుగుతాయనేది ఆందోళన.

ఉద్యమానికి శ్రీకారం..

ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

చెన్నై వేదికగా..

చెన్నైలోని ఓ హోటల్ దీనికి వేదిక. ఫెయిర్ డీలిమిటేషన్ (Fair delimitation) అనేది ఈ భేటీ ప్రధాన డిమాండ్. దీనికి హాజరు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు స్టాలిన్. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు కానున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్..

జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటోన్నందున కాంగ్రెస్ దీనికి మద్దతు ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు కానున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకం కావడం వల్ల అటు భారత్ రాష్ట్ర సమితి నాయకులు సైతం ఈ భేటీలో పాల్గొనబోతోన్నట్లు చెబుతున్నారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు..

రేవంత్ రెడ్డి సహా కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు - పినరయి విజయన్, భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానం అందినప్పటికీ- ఆ పార్టీ ప్రాతినిథ్యం ఉండట్లేదు. ఇందులో పాల్గొనదలచుకోలేదు.

చెన్నై చేరిన డీకేశి..

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. కొద్దిసేపటి కిందటే చెన్నైకి చేరుకున్నారు కూబా. డీఎంకే సమావేశానికి హాజరు కానున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ భేటీకి తాను హాజరు కావట్లేదని, పార్టీ తరఫున డీకే హాజరవుతారంటూ ఇదివరకే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు స్టాలిన్‌కు లేఖ రాశారు.

Stalin

తెలుగుదేశం, జనసేన

దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన డీలిమిటేషన్‌ ప్రక్రియ ఉద్యమానికి దూరంగా ఉంటోన్నాయి. దీనికి వ్యతిరేకంగా గళమెత్తడానికి నిరాకరిస్తోన్నాయి. ఈ విషయంలో స్టాలిన్‌తో చేతులు కలపడానికి ఇష్టపడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరిని ఇక్కడ కూడా కొనసాగిస్తోంది. ఫలితంగా- డీఎంకే నిర్వహిస్తోన్న ఈ సమావేశానికి ప్రధాన పార్టీల నుంచి ప్రాతినిథ్యం ఉండకపోవచ్చు. మిగిలిన అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.

డీలిమిటేషన్ వ్యవహారంపై..

ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కావడం వల్ల అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ.. డీలిమిటేషన్ వ్యవహారంపై మౌనంగా ఉంటోన్నారు. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడకూడదని ఈ ఇద్దరు నాయకులు బలంగా నమ్ముతున్నారు.

DK Shivakumar

చంద్రబాబు స్పందనేంటీ?

ఇటీవలే తన ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు కూడా. ప్రెస్ మీట్‌లో విలేకరులు ప్రశ్నించిన తరువాతే ఆయన స్పందించారు. డీలిమిటేషన్ బిల్లు ఇంకా రూపుదిద్దుకోలేదని గుర్తు చేశారు. జనాభా పెరుగుదలకు డీలిమిటేషన్‌కు సంబంధం లేదనీ వ్యాఖ్యానించారు అప్పట్లో.

ఒకే దృష్టితో చూడటం..

డీలిమిటేషన్ వల్ల బిహార్, ఉత్తరప్రదేశ్ ఎక్కువగా లబ్ది పొందగలుగుతాయనీ చెప్పారు. ఇది- ప్రతి 25 సంవత్సరాలకోసారి జరిగే ప్రక్రియగా అభివర్ణించారు. డీలిమిటేషన్‌ నేపథ్యంలో అన్ని సమస్యలను ఒకే దృష్టితో చూడటం సరికాదనీ చెప్పారు. జనాభా తాను జాతీయ ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

ఆందోళనలను పరిష్కరించేలా

డీలిమిటేషన్ తరువాత పార్లమెంటరీ ప్రాతినిథ్యాన్ని కోల్పోతామనే ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొని ఉందని ఆయన అంగీకరించారు. ఈ ఆందోళనలను కూడా పరిష్కరించే దిశగా మున్ముందు నిర్ణయాలను తీసుకుంటామని, బీజేపీ అనుసరించే ప్రక్రియ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక దక్షిణాదికీ ప్రయోజనకరంగా ఉంటుందనే ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+