వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ స్కూళ్లల్లో ఫేస్ యాప్: డ్యూటీకి రావడంలో ఒక్క నిమిషం లేటైనా..టీచర్లకు సెలవే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వాళ్టి నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్‌, ఐరిస్‌ స్థానంలో ఫేస్ యాప్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయులు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా.. ఆ రోజును సెలవుగా పరిగణించేలా దీన్ని రూపొందించింది పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ.

అటెండెన్స్ కోసం..

అటెండెన్స్ కోసం..

దీన్ని సిమ్స్‌-ఎపీగా పేరుతో ఈ యాప్ ఇప్పటికే ప్లేస్టోర్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పని చేస్తుంది. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడూ తప్పనిసరిగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు కూడా అదే యాప్‌ నుంచి హాజరు వేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువే.

9 గంటల్లోగా..

9 గంటల్లోగా..

రాష్ట్రంలో మొత్తం 1.8 లక్షలమంది ఉపాధ్యాయులు పని చేస్తోండగా.. 25 నుంచి 30 వేల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ ఇవ్వాళ్సి ఉంటుంది. నిర్దేశిత 9 గంటల గడువు కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనప్పటికీ.. దాన్ని సెలవురోజుగా పరిగణిస్తుంది ప్రభుత్వం.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో..

అలాంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా, సకాలంలో హాజరు కావట్లేదంటూ ఫిర్యాదులు అందుతోన్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. తొలుత హెడ్మాస్టర్ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఉపాధ్యాయుల ముఖాలను మూడు కోణాల్లో ఇందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వ్యతిరేకత మొదలు..

వ్యతిరేకత మొదలు..

ఈ యాప్‌ పట్ల ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించని వారు చాలా మంది ఉన్నారనే వాదన వారిలో ఉంది. అలాంటి వారి అటెండెన్స్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తోన్నారు. సకాలంలో పాఠశాలకు వచ్చినప్పటికీ.. నెట్‌వర్క్‌, ఇంటర్‌నెట్, సర్వర్ వంటివి పనిచేయకపోతే దీనికి బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే 12 రకాల యాప్స్..

ఇప్పటికే 12 రకాల యాప్స్..


సాంకేతికపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటి ఎలా అధిగమించాలనే విషయం మీద అధికారుల వద్ద కూడా సరైన సమాధానం ఉండట్లేదని చెబుతున్నారు. సిమ్స్-ఏపీ యాప్‌కు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకుని రాకముందే ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల ఉపయోగం ఉండబోదని స్పష్టం చేస్తోన్నారు. ఇప్పటికే 12 రకాల యాప్‌లను ఉపాధ్యాయులు వినియోగిస్తోన్నారని, ఇప్పుడు కొత్తగా దీన్నీ అందుబాటులోకి తీసుకుని రావడం సరికాదని మండిపడుతున్నారు.

English summary
AP school education department has developed an attendance app based Artificial Intelligence called SIMS-AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X