సైబర్ క్రిమినల్స్ స్కెచ్, ఎంఆర్ఓను టార్గెట్ చేసి చివరికి ?
ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ శాఖ ఉద్యోగులను టార్గెట్ చేసుకున సైబర్ నేరస్తులు వారిని బెదిరించి నిలువు దోపిడీ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారుల్ని బెదిరిస్తున్న నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసిన నిందితులు నువ్వు అక్రమ ఆస్తులు సంపాదించావని, మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీ పైన కేసులు నమోదు చేస్తామని బెదిరంచారు.
కేసులు నమోదు అయితే నీ ఉద్యోగం పోతుందని ఎంఆర్ఓను బెదిరించారు. ఏసీబీ అధికారుల పేరుతో ఆ ఎంఆర్ఓను పరిచయం చేసుకున్న నిందితులు నువ్వు భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాధించావని బెదిరించి ఆయన నుంచి లక్షలాది రూపాయలు వసూలు చెయ్యడంతో సాటి రెవెన్యూ శాఖ ఉద్యోగుల హడలిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండల ఎంఆర్ఓకి ఫోన్ చేసిన నిందితులు మేము ఏసీబీ అధికారులు అని పరిచయం చేసుకున్నారు.

నువ్వు భారీ మొత్తంలో అక్రమాస్తులు సంపాధించావని, నీ అక్రమాస్తుల జాబితా మొత్తం మా దగ్గర ఉందని ఆయన్ను బెదిరించారు. నువ్వు వెంటనే మాకు రూ 5 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే నీపైన కేసు నమోదు చేస్తామని, నీ ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోతుందని బెదిరించారు. చివరికి నిందితులు రూ 3,50 లక్షలు తీసుకోవడానికి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నారు. హడలిపోయిన ఎంఆర్ఓ ఆయన బంధువులను సంప్రదించారు.
తరువాత ఆ ఎంఆర్ఓ నిందితులు సూచించిన ఖాతాలోకి ఆయన బంధువుల అకౌంట్ల నుండి రూ 3.50 లక్షల పంపించాడు. ఆ తర్వాత ఎంఆర్ఓ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఏసీబీ అధికారులు తనకు ఫోన్ చేయలేదని, తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన చేజర్ల ఎంఆర్ఓ సంగం సీఐ వేమారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నకిలీ ఏసీబీ అధికారుల కోసం గాలిస్తున్నారు.
చేజర్ల ఎంఆర్ఓ ను మోసం చేసి రూ 3.50 లక్షలు డబ్బులు వసూలు చేశారని తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు హడలిపోయారని తెలిసింది. ఎవరైనా ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్లు చేసినా, మిమ్మల్ని సంప్రదించినా వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు రెవెన్యూ శాఖ అదికారులు, ఉద్యోగాలకి సూచించారని సమాచారం.












Click it and Unblock the Notifications