Fake Notes: కోనసీమలో విచ్చలవిడిగా ఫేక్ నోట్లు-కస్టమర్లకు బ్యాంకుల కీలక సూచన
ఏపీలో నకిలీ నోట్ల చెలామణీ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ నోట్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఏకంగా బ్యాంకు ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేస్తున్నా అందులోనూ ఫేక్ నోట్లే దర్శనిమిస్తుున్న పరిస్దితి. దీంతో కస్టమర్లు నోట్లు తీసుకోవాలంటే భయపడుతున్నారు. కోనసీమ ప్రాంతంలోని పలు చోట్ల ఈ ఫేక్ నోట్ల భయం కస్టమర్లను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు కీలక సూచనలు చేస్తున్నాయి.
కోనసీమలో ఫేక్ నోట్ల చెలామణి విపరీతంగా ఉంది. జిల్లా పరిధిలోని కొత్తపేట,మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం ప్రాంతాల్లో 100,200,500 రూపాయల కట్టల్లో కనీసం ఒక ఫేక్ నోటు వస్తుందని చెబుతున్నారు. దీంతో లెక్కింపు తర్వాత కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇవి కూడా అసలు నోట్లలాగే ఉండటంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు. తిరిగి వాటిని డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో సమస్యలు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా స్పందించి కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి. నోట్లు సరి చూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు కస్టమర్లకు సూచిస్తున్నారు.ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తమ బ్యాంకు బ్రాంచ్ లను సంప్రదించాలని కోరుతున్నారు. ఫేక్ నోట్లపై ఇప్పటికే పోలీసులకు కూడా పలు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో వారు కూడా ఈ ఫేక్ నోట్లను చెలామణి చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. ఇలా ఓవైపు బ్యాంకులు, మరోవైపు పోలీసులు కూడా నకిలీ నోట్లపై దృష్టిసారించారు.












Click it and Unblock the Notifications