ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తప్పిన భారీ ప్రమాదం-రెండు ముక్కలుగా విడిపోయి..!
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఇవాళ భారీ ప్రమాదం తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం సమీపంలోకి రాగానే ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అదీ మొత్తం రైలు సగానికి విడిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మధ్యలోనే ఇలా విడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది రైలును నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. సూపర్ ఫాస్ట్ రైలు కావడం, ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరిగి బోగీల్ని జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు ఎందుకు విడిపోయాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అన్నది తేలాల్సి ఉంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications