ఫ్యాన్ vs గాజు గ్లాస్.. సినిమాటిక్ వీడియోతో దుమ్మురేపిన పవన్ కళ్యాణ్!!
రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రజల మనసులలో తమ పార్టీ నాటుకునే, తమ పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల నేతలు. ముఖ్యంగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్కచెల్లెళ్ల కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం నిత్యం బటన్ నొక్కుతున్నానని, వచ్చే ఎన్నికలలో ఒకసారి ఓటర్లు అందరూ ఫ్యాన్ బటన్ నొక్కాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.
అయితే ఓటర్లు ఫ్యాన్ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో చెబుతూ జనసేన గాజు గ్లాసు అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఫ్యాన్ స్విచ్ బటన్ నొక్కగానే, ఫ్యాన్ గాలికి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయం, రాష్ట్ర ప్రజల ఉద్యోగావకాశాలు, రాష్ట్రంలోని మౌలికవసతులు, పరిశ్రమలు ఇలా అనేకం చెల్లాచెదురుగా మారాయని ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

ఇక దానిని కాపాడాల్సిన బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి విధ్వంసం కాకుండా, ఫ్యాన్ గాలికి చెదిరిపోకుండా గాజు గ్లాస్ కాపాడుతుందని దాని ద్వారా సందేశం ఇచ్చారు. చాలా సినిమాటిక్ వేలో ప్రజలకు అర్థమయ్యేలా చేసిన ఆ వీడియోలో టేబుల్ పై పెట్టిన పేపర్లు గాలికి ఎగిరి పోతుంటే, వాటిని తిరిగి తెచ్చి అవి మళ్లీ చెల్లాచెదురు కాకుండా దానిపై గాజుగ్లాసును పెట్టారు పవన్ కళ్యాణ్.
"ఫ్యాను" గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన "గాజు గ్లాసు."#JanasenaFormationDay#BJP #JSP #TDP#HelloAP_ByeByeYCP pic.twitter.com/idTuQM0yx3
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2024
ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమ్ము రేపుతుంది. పొత్తు గెలవాలి ప్రభుత్వం రావాలి అన్న పేరుతో చేసిన ఈ వీడియోకు "ఫ్యాను" గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన "గాజు గ్లాసు." అంటూ ఎక్స్ వేదికగా జనసేన ఒక పోస్టు పెట్టింది.
చాలా సినీ ఫక్కీలో, ప్రొఫెషనల్ గా తీసిన ఈ సూపర్ వీడియో ద్వారా రాష్ట్రంలో వైసిపి ఫ్యాన్ పరిస్థితి ఇలా ఉందని, కాపాడవలసిన బాధ్యతను జనసేన గాజు గ్లాసు తీసుకుందని చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను తీసుకున్న జనసేన గాజు గ్లాసును ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేశారు. నోటితో చెప్పే మాటల కన్నా, దృశ్యం గట్టిగా గుర్తుంటుంది అని జనసేన కొత్త పంధాలో చేసిన ఈ వీడియో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications