వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌పై వ్యూహాత్మక పుకార్లు: జగన్‌పై చిరంజీవి ప్లాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో పడినట్లు సమాచారం. సీమాంధ్ర ఉద్యమం విషయంలో చిరంజీవి పెద్దగా మాట్లాడకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ఆయన అంగీకారం తెలిపినట్లు కూడా భావిస్తున్నారు.

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్యాడర్‌కు, అభిమానులకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పడినట్లు ప్రచారం సాగుతోంది. సీమాంధ్రలో కాంగ్రెసు పరిస్థితి దిగజారడంతో చిరంజీవి వద్దకు వెళ్ళి తమ రాజకీయ భవిష్య త్తుపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ స్థితిలో సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ప్రత్యర్థులు వ్యూహాత్మక ప్రచారం సాగించినట్లు భావిస్తున్నారు.

fans unhappy on Chiranjeevi silence

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన రోజుల్లో చిరంజివికి బాసటగా నిలిచిన వారిలో అత్యదికంగా తెలుగుదేశం పార్టీకి చెందినవారే కావడం విశేషం. అనంతరం జరిగిన జరిణామాలలో భాగంగా ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో పార్టీ కేడర్ అంతా అటుఇటూగా కాంగ్రెస్‌లో చేరిపోయారు.విలీనం నచ్చని కొద్ది మంది వేరే పార్టీల్లో చేరిపోయారు.

చిరంజీవి మద్దతుతో రాజకీయంగా ఎదుగుదామనే కాంక్షతో వున్న పలువురు నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆశలపై సీమాంధ్ర ఉద్యమం నీళ్ళు చల్లింది. కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత చిరంజీవి కుదురుకున్నట్లు కనిపించారు. అంతేకాకుండా అధిష్టానం వద్ద కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. దీన్ని ఆసరా చేసుకుని జిల్లాల్లో ఎదుగుదామని ఆయన వర్గానికి చెందినవారు ఆశపడ్డారు. కానీ తాజా పరిణామాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి.

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన చిరంజీవి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర సెంటిమెంట్ విషయంలో ఏం చేయాలనే సందిగ్ధంలో పడినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో చిరంజీవి వర్గానికి చెందిన వారిని తెలుగుదేశం పార్టీ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో చిరంజీవి కూడా వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తన వర్గానికి చెందినవారిని టిడిపి వైపు పురమాయిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి సలహాలను కొందరు వ్యతిరేంచాలని భావించినప్పటికీ, ఎదిరించే సాహసం చేయలేకపోతున్నా

చిరంజీవి వ్యూహంలో భాగంగానే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప తదితర జిల్లాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు రాష్ట్ మంత్రులుగా నియమితుల య్యారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలుగా వున్న వంగా గీత, బండారు సత్యానందరావు, పంతం గాంధీ మోహన్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెంకటరామయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట త్రిమూర్తులు తదితర ఎమ్మెల్యేలు, నాయకులంతా తెలుగుదేశం నుంచి వచ్చినవారే.

తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చిన ఒక్క శోభానాగిరెడ్డి మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. అన్ని జిల్లాల్లోనూ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు కావడంతో ఆ పార్టీలో చేరితేనే సానుకూలంగా వుంటుందనేది చిరంజీవి అభిప్రాయంగా వుందని ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత అనేది చెప్పలేని స్థితి ఉంది. ఇదే వ్యూహాన్ని అనుసరిస్తే చిరంజీవి విజయం సాధిస్తారా అనేది కూడా అనుమానమేనని అంటున్నారు.

English summary

 It is said that union minister Chiranjeevi is in a plan to encourage his followers towards Nara Chandrababu Naidu's Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X