సచివాలయం వద్ద రైతుల బైఠాయింపు: కొనసాగుతున్న ఆందోళనలు: వంట వార్పూ..!
ఏపీ రాజధాని తరలింపు ప్రతిపాదన పైన అమరావతిలో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అంశం పైన హైపవర్ కమటీ వేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా..అసెంబ్లీలో చర్చంచి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. అయితే, రాజధాని రైతులు..స్థానికులు మాత్రం ఆందోళన విరమించలేదు. ప్రభుత్వం అసలు ఈ ప్రతిపాదననే ఉప సంహరించుకో వాలని డిమాండ్ చేస్తూ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సచివాలయం వద్ద రైతులు స్థానికులు బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడి నుండి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారుల మీద స్థానిక ప్రజలు దీక్షలకు దిగారు. ధర్నాలు చేస్తున్నారు. దీంతో..రహదారుల మీద ధర్నాలు వద్దంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు.
11వ రోజు కొనసాగుతున్న నిరసనలు..
అమరావతి గ్రామాల్లో వరుసగా 11వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహా ధర్నా కొనసాగిస్తున్నారు. మహిళలు అక్కడ మండుటెండతో రోడ్డు పైన మోకాళ్లతో నిలబడి ప్రధాని ఫొటోలతో ఉన్న ప్లకార్డులను చేపట్టి..నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలింపు పైన కమిటీలు వద్దని..ఖచ్చితంగా రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరి మండలంలోని గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

ఐనవోలు నుండి మందడం వద్దకు బయల్దేరిన రైతులను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. కిష్టాయపాలెంలో నిరసన దీక్ష కొనసాగుతోంది. అనేక చోట్ల రైతులు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్ల పైనే బైఠాయించారు. తుళ్లూరులో మహాధర్నా కొనసాగుతోంది. అక్కడే వంటా వార్పూ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ జేఏసీ నేతల ఆందోళన
ఇక..గుంటూరు..విజయవాడల్లో రాజకీయ జేఏసీలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడతో పాటుగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ..జనసేన..వామపక్ష పార్టీలు కలిసి అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బోస్టన్ సంస్థ నివేదిక పూర్తి స్థాయిలో అందిన తరువాత హైలెవల్ కమిటీ నియమించి..వారి సిఫార్సుల పైన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని నిర్ణయించింది.
ఆ సమావేశంలో కమిటీ నివేదికను చర్చించి..తుది నిర్ణయం ప్రకటించాలని కార్యాచరణ సిద్దం చేస్తోంది. అయితే, అసలు ఈ ప్రక్రియ మొత్తాన్ని అమరావతి ప్రాంత స్థానికులు..పార్టీలు..రైతులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ..అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications