నెరవేరని సంకల్పం: శ్రీశైల మల్లన్న దర్శనానికి కాలినడకన వెళ్తూ..!

కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి కాలినడకన వెళ్తున్న కర్ణాటకకు చెందిన భక్తుల పై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నూలు-బళ్లారి రహదారిపై కప్పట్రాళ్ల సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఎర్రగుడి గ్రామానికి చెందిన 42 మంది భక్తులు కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. ఉగాది పండుగ నాటికి శ్రీశైలం చేరుకుని, మల్లికార్జునుడిని దర్శించుకోవాలనేది వారి సంకల్పం.

బుధవారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో కప్పట్రాళ్ల మీదుగా కర్నూలు వైపు వెళ్తుండగా.. అదుపు తప్పిన లారీ భక్తులపై దూసుకెళ్లింది. లారీ వేగానికి భక్తులు చెల్లాచెదురయ్యారు. ముగ్గురు భక్తులు చక్రాల కింద పడి నలిగిపోయారు. మృతులను ఉలిగయ్య, షేకుగా గుర్తించారు. ఈ ఘటనలో దేవేందర్‌ రెడ్డి, పోతప్ప, గాదెలింగ, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

fatal accident in kurnool district 3 devotess died

గాయపడ్డవారిలో దేవేందర్‌రెడ్డి, పోతప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. అప్రమత్తమైన స్థానికులు లారీని వెంబడించారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని నిర్ధారించారు. తమతో వచ్చినవారు ప్రమాదంలో విగతజీవులుగా మారడంతో భక్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+