ఏడో తరగతి చదువుతున్న కూతురికి తండ్రి లైంగిక వేధింపు
హైదరాబాద్: కన్న కూతురుతోనే అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అల్వాల్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన 50 ఏళ్ల వయసు గల వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం భార్య చనిపోయింది. తండ్రి ఇటీవల ఏడో తరగతి చదువుతున్న కుమార్తెను తరచూ లైంగికంగా వేధించసాగాడు. దీని పైన కుమార్తె శనివారం అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తండ్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.

మహిళ గొంతు కోసి పరారైన ఇద్దరి అరెస్ట్
చుట్టపుచూపుగా ఇంటికి వచ్చి సమీప బంధువైన మహిళ మెడలోని గొలుసును దొంగిలించేందుకు యత్నించి గొంతు కోసి పరారైన వ్యక్తిని, అతడికి సహకరించిన స్నేహితుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా గోమారానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు.
గతంలో రేప్ కేసులో జైలుకు వెళ్లిన ఇతడు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. అతడు తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి శుక్రవారం హైదరాబాదుకు వచ్చాడు కుత్బుల్లాపూర్‌లోని సూరారంలో నివాసం ఉండే, బావ వరుసయ్యే మాసిరెడ్డి ఇంటికి వెళ్లారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మాసిరెడ్డి భార్య మాధవి మెడలో ఉన్న బంగారం పైన కన్నేశారు. శ్రీనివాస్ రెడ్డి మాధవిని అరవకుండా గట్టిగా గొంతు నొక్కి పట్టుకొని మెడలోని పుస్తెలతాడును తెంచేందుకు ప్రయత్నించాడు.
మాధవి ప్రతిఘటిస్తుండటంతో దేవేందర్ తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె కేకలు వేయడంతో ఇద్దరు పరారయ్యారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాఫ్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.












Click it and Unblock the Notifications