కన్నబిడ్డనే చెరబట్టి గర్భవతిని చేసిన కీచకుడా తండ్రి .. ఏపీలో దారుణం ఆలస్యంగా వెలుగులోకి !!
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కామ పిశాచిలా మారాడు. 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా బాలికపై పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తల్లికి,మరెవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. కామాంధుడైన తండ్రి కర్కశత్వానికి బలైపోయిన బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు తండ్రి పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి .. పలుమార్లు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కన్నతండ్రి కీచకుడిగా మారాడు. ప్రకాశం జిల్లాలో కుమార్తెను చెరబట్టాడు. కడుపున పుట్టిన కూతురుపై కన్నేసిన కసాయి తండ్రి ఆ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. మృగంలా ప్రవర్తించి అనేకమార్లు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఊరికి దూరంగా ఓ ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. గత జనవరి నెలలో బాలిక తల్లి సరుకులు కొనుగోలు చేసేందుకు పక్క గ్రామానికి వెళ్లడంతో, ఫుల్లుగా మద్యం తాగొచ్చి ఇంట్లో ఉన్న కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తండ్రి వేధింపులు భరించలేక 100కు కాల్ చేసిన బాలిక
ఇక అప్పటి నుండి పలు దఫాలుగా కన్నబిడ్డపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. తన కామ వాంఛ తీర్చుకోవటానికి అభం శుభం తెలియని కూతురు జీవితాన్ని బలి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లి , కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేయడంతో పాటుగా, నిత్యం కొడుతూ వేధించేవాడు. దీంతో తండ్రి వేధింపులు భరించలేక బాలిక ఇరవై రోజుల క్రితం 100 నెంబర్ కి ఫోన్ చేసి తనకు సహాయం కావాలని కోరింది.

ఐదు నెలల గర్భవతిని చేసి కూతురు జీవితం నాశనం చేసిన తండ్రి
పోలీసులు వెళ్లి తండ్రిని మందలించి బాలికను తాత గారి ఇంటికి పంపించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి గురించి తెలుసుకున్న తాత, బాలిక గర్భవతి అని తెలియటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో ఇంతకాలం బాలిక తండ్రి భయపడి ఫిర్యాదు చేయలేదని వారంటున్నారు. కాపాడాల్సిన కన్న తండ్రే ఇంతటి దారుణానికి ఒడిగడితే కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భవతి కావడంతో తండ్రి చేసిన దారుణానికి బాలిక జీవితం ప్రశ్నార్థకంగా మారింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications