అమ్మో బయోమెట్రిక్కా..? మేం వాడబోమంటున్న ఏపీ రేషన్ డీలర్లు...

ఏపీలో ఈసారి బయోమెట్రిక్ విధానంలో రేషన్ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఆదిలోనే హంసపాదు పడినట్లవుతోంది. కరోనా వ్యాప్తి భయాలతో రేషన్ సరుకులను బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేసేందుకు రేషన్ డీలర్లు నిరాకరిస్తున్నారు. గత రెండు సార్లు ప్రభుత్వం కరోనా వ్యాప్తి భయాలతో బయోమెట్రిక్ విధానానికి మినహాయింపు ఇచ్చింది. వాలంటీర్ల ద్వారా స్లిప్లులను ఇంటికే పంపించి వాటిని తీసుకొస్తే చాలు రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే రెండుసార్లు బయోమెట్రిక్ లేకుండా రేషన్ పంపిణీ చేసిన డీలర్లు ఈసారి బయోమెట్రిక్ పెడితే మూడో విడత రేషన్ పంపిణీ చేయలేమని చెతులెత్తేస్తున్నారు. వృత్తి కన్నా ప్రాణాలే ముఖ్యమని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతుందని భావించే ప్రభుత్వం రెండుసార్లు బయోమెట్రిక్ మినహాయింపు ఇచ్చిందని ఇప్పుడు మాత్రం కరోనా తగ్గకుండానే బయోమెట్రిక్ ప్రవేశపెట్టడం సరికాదని వారు చెబుతున్నారు.

fear of covid 19 spread ap ration dealers not willing to use biometrics

Recommended Video

    Lockdown In AP will Be Eased in Green Zones Across The State

    రేషన్ పంపిణీలో అక్రమాలు నివారించేందుకు ప్రభుత్వం గతంలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చింది. కొన్ని లోపాలున్నా ఈ విధానంలో అక్రమాలు లేకుండా జనానికి రేషన్ సక్రమంగా చేరుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో తప్పనిసరై రెండు సార్లు మినహాయింపు ఇవ్వడంతో ఇప్పుడు రేషన్ డీలర్లు అదే సాకుగా ఈ విధానం వద్దని డిమాండ్లు వినిపిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+