రాచకొండలో ఫిల్మ్ సిటీకి కేసీఆర్ ప్లాన్, 4 హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిల్మ్‌ సిటీ, ఫార్మా సిటీ, సోలార్‌ సిటీల రూపకల్పనలో భాగంగా సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారం, హయత్‌నగర్‌, ముచ్చర్ల, ఆమనగల్‌, రాచకొండ ప్రాంతాల్లో సర్వే జరగనుంది. ఫార్మా, ఫిల్మ్‌ సిటీ, సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం రాచకొండగుట్టల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అవసరమైతే ఈ గుట్టలను సోలార్‌, పవన విద్యుత్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ముగించుకున్న కేసీఆర్‌ ఇక క్షేత్రస్థాయిలో కలల సాకారానికి అడుగులు వేస్తున్నారు. మూడు జిల్లా (రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ)ల్లో విస్తరించి ఉన్న రాచగొండ గుట్టలపై దృష్టి సారించారు. ఇటీవలే నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుట్టలపై ఆరా తీశారు. వాటిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

డిసెంబర్‌ మూడో తేదీన ఆయన రాచకొండ గుట్టలపై విహంగ వీక్షణం చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తల బృందాలను ఆయన తన వెంట తీసుకెళ్తారు. ఇందుకు ఏకంగా నాలుగు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. వాటిలో ఆయన అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధి బృందాలను తీసుకెళ్లనున్నారు.

హైదరాబాద్‌ శివార్లలోని రాచకొండ గుట్టలతోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముచ్చెర్లలో 2,500 ఎకరాల్లో ఫార్మా జోన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాచకొండ గుట్టల ప్రాంతంలో 2,500 ఎకరాల్లో సినీ పరిశ్రమ కోసం ఫిల్మ సిటీని నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలను స్థల పరిశీలనకు తీసుకు వెళ్లాలని నిర్ణయించింది.

Film city: K Chandrasekhar Rao plans aerial survey

అయితే, ఎంపిక చేసిన స్థలాలు వేల ఎకరాల్లో ఉండడంతో పారిశ్రామిక బృందాలను రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లలో తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనికి ముందుగా ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఆదివారం పంపుతోంది. స్థలాలను పరిశీలించి రూటు మ్యాప్‌ తయారు చేయాలని ఉన్నతాధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల సమాచారం ఆధారంగా సీఎం పర్యటనకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. రాచకొండ గుట్టల్లో ఏరియల్‌ వ్యూ నిర్వహించనున్న కేసీఆర్‌, పారిశ్రామిక బృందాలు ముచ్చర్లలో మాత్రం కిందకు దిగి పరిశీలన జరపనున్నాయి. కాగా, రాచకొండ గుట్టలు 35,000 ఎకరాల్లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+