సత్యం కుంభకోణం కేసు: తుది తీర్పు మార్చి 9కి వాయిదా

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. సెబీ కేసులో ఆర్థిక నేరాల కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అలాగే ఇదే కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిలిపివేసింది.

 Final verdict postponed in Satyam scam

2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ అప్పటి చైర్మన్ రామలింగరాజు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా అభియోగాలు మోపింది.

 Final verdict postponed in Satyam scam

సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో ఆర్థిక నేరాల దర్యాఫ్తు సంస్థ ఇటీవల తీర్పును వెలువరించిన విషంయ తెలిసిందే. మొత్తం ఏడు రకాల కేసులను పెట్టగా.. ఆరు కేసులకు సంబంధించిన తీర్పును ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు వెలువరించింది. ఒక కేసును కొట్టివేసింది. రామలింగ రాజు, రారాజులకు 5 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నాలుగు కేసుల్లో ఒక్కో దానికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. రామ్ మైనంపాటికి 3 కేసుల్లో ఆర్నెళ్ల జైలు శిక్ష చొప్పున విధించింది. రూ.10 లక్షల జరిమానాను విధించింది.

 Final verdict postponed in Satyam scam

సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ జి పాలెపు, శ్రీనివాస్, వినోద్ కె దామ్, టీఆర్ ప్రసాద్‌లకు రూ.20వేలు చొప్పున జరిమానా విధించింది. వడ్లమాని శ్రీనివాస్‌కు 3 కేసుల్లో ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. కాగా, తీర్పు పైన నెల రోజుల పాటు అప్పీలుకు అవకాశం ఇచ్చింది. కాగా, ఐదేళ్ల క్రితం 2009 సంవత్సరంలో సత్యం కుంభకోణం బయటపడింది. ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపేసింది. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా రామలింగ రాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+