ప్యాకేజీతో ఏపీకి కలిగే లాభాలివే!: ఓ టీవీ ఛానెల్‌ అడిగిన ప్రశ్నకు జైట్లీ

అమరావతి: సెంటిమెంట్‌తో అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి జరగాలంటే డబ్బులు ఉండాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.

కేంద్రం ఇచ్చే స్పెషల్ ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో లాభం కలుగుతుందని ఆయన అన్నారు. ఏపీ ప్యాకేజీకు కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదముద్ర వేస్తుందని, చట్టబద్ధత వచ్చాక అమలుకు ఢోకా ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింది

ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింది

ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, హోదా సాధ్యం కానందునే ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. విదేశీ సంస్థల ద్వారా ఏపీ తీసుకునే రుణాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దీనికి త్వరలో కేబినెట్ అనుమతి తీసుకుంటామన్నారు. ప్యాకేజ్ తో ఏపీకి చాలా లాభమని, చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు.

రెవెన్యూలోటు పూడ్చేందుకు కేంద్రం నిధులు

రెవెన్యూలోటు పూడ్చేందుకు కేంద్రం నిధులు

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు పూడ్చేందుకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. ఏపీకి అన్ని విధాలా కేంద్రం సాయం అందిస్తుందని ఆయన తెలిపారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు పలువురు రాజ‌కీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు పని లేదంటూ అసలు 2004 నుంచి 14 వరకు ఏపీకి ఎంత మేర నిధులు ఇచ్చారో కాంగ్రెస్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు.

విదేశీ సంస్థల ద్వారా తీసుకునే రుణాలను కేంద్రమే చెల్లిస్తుంది

విదేశీ సంస్థల ద్వారా తీసుకునే రుణాలను కేంద్రమే చెల్లిస్తుంది

స్పెషల్ ప్యాకేజీలోని అంశాలను జైట్లీ ప్రస్తావిస్తూ విదేశీ సంస్థల ద్వారా తీసుకునే రుణాలను కేంద్రమే చెల్లిస్తుందన్నారు. పెట్రోలియం సహా అన్ని శాఖలు ఏపీలో కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెడుతున్నాయని జైట్లీ అన్నారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌రిన్ని ప్ర‌భుత్వం రంగ సంస్థ‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఏపీకి రూ.2.06 లక్షల కోట్లు అదనంగా ఇస్తున్నాం

ఏపీకి రూ.2.06 లక్షల కోట్లు అదనంగా ఇస్తున్నాం

పోల‌వ‌రం ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తి పైసాను కేంద్ర‌మే భ‌రిస్తుందని చెప్పారు. ఏడాదిన్న‌ర‌లో ఏపీలో 20కి పైగా సంస్థ‌లు నెల‌కొల్పామ‌ని అన్నారు. రాజ‌ధానికి నిధుల కేటాయింపులో జాప్యం ఉండబోద‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీకి రూ.2.06 లక్షల కోట్లు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కూడా నిధుల కేటాయింపులో భాగమే కదా? అని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+