జగన్, చంద్రబాబు అప్పులివే..! పార్లమెంట్లో అసలు లెక్క తేల్చేసిన కేంద్రం.. !

ఏపీలో గత నాలుగేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య ఓ విషయంలో తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఐదేళ్ల పాలన చేసిన టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించింది. ఆ తర్వాత తాను కూడా అప్పులు చేస్తూ పోయింది. దీంతో టీడీపీ కూడా వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పుల్ని టార్గెట్ చేస్తూ వస్తోంది. వైసీపీ, టీడీపీ ఎవరి లెక్కలు వారు చెప్తుండగా.. అసలు లెక్కలు మాత్రం బయటికి రావడం లేదు. దీనిపై కేంద్రం తాజాగా పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, అలాగే ప్రస్తుతం వైసీపీ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. లోక్ సభలో తెలంగాణలోని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ వివరాలు తెలిపారు. వివిధ కార్పోషన్ల ద్వారా తీసుకున్న అప్పుతో కలిపి 2019 మార్చి నాటికి ఎన్ని అప్పులున్నాయి, అలాగే 2023 మార్చి నాటికి ఎన్ని అప్పులకు చేరాయన్న దానిపై నిర్మల క్లారిటీ ఇచ్చారు.

finance minister nirmala sitaraman reveals actual borrowings under jagan, babu regimes in ap

ఏపీలో 2019 మార్చి నాటికి అంటే ఐదేళ్ల చంద్రబాబు పాలన దాదాపు పూర్తయ్యే సరికి ఏపీ అప్పు రూ.2,64,451 కోట్లుగా నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. అలాగే 2023 మార్చి నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపుగా నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకునే నాటికి ఈ పద్దు కాస్తా రూ.4,42,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మల వెల్లడించారు. అంటే వైసీపీ నాలుగేళ్ల పాలనలో
దాదాపు రూ.1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు తేల్చారు. దీంతో 4 లక్షల కోట్లంటూ ఇన్నాళ్లూ విపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలు తప్పని తేలింది.

వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 2019-20లో ఏపీ వాటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పేరుతో రూ.1931 కోట్లు, ఏపీ రోడ్డు అభివృద్ధి కార్పోరేషన్ పేరుతో 2020-21లో రూ.1158 కోట్లు అప్పు చేసినట్లు తెలిపారు. అలాగే 2022-23లో ఫిషరీస్ ఫండ్ నుంచి రూ.450 కోట్ల అప్పు, వేర్ హౌసింగ్ ఫండ్ నుంచి 2019-20లో రూ.11.40 కోట్లు, మైక్రో ఇరిగేషన్ ఫండ్ నుంచి 2020-21లో రూ.616 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి నుంచి 2019-23 మధ్య రూ.6212 కోట్లు అప్పు చేసినట్లు తేలింది. రుణ సదుపాయ ఫెడరేషన్ల నుంచి ఈ నాలుగేళ్లలో రూ.24311 కోట్లు తీసుకున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+