విజయవాడ లెనిన్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం...రూ. 40 లక్షల ఆస్థి నష్టం!

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న లెనిన్ సెంటర్లో మంగళవారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు రెడీమెడ్ బట్టల షాపులతో పాటు చెప్పుల షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సుమారు రూ. 40 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం సోమవారం అర్థరాత్రి దాటాక జరగడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టడంలో కొంత ఆలస్యమైంది. అనంతరం రంగ ప్రవేశం చేసిన అగ్నిమాపక దళ సిబ్బంది నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. దీంతో మరింత పెను ప్రమాదం తప్పింది.

Fire Accident in Linen Center at Vijayawada

లేనిపక్షంలో వరుస క్రమంలో ఉన్న అనేక షాపులు అగ్నికి ఆహుతి అయ్యేవి. దీనివల్ల ఊహించనంత పెను నష్టం వాటిల్లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada:Property worth of about Rs. 40 lakhs was reduced to ashes in a major fire mishap that occurred in the Shoping complex of Lenin centre in Vijayawada in the early hours on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి