అల్లూరి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా-ఐదుగురు మృతి-భారీగా క్షతగాత్రులు ?
ఏపీలోని అల్లూరి జిల్లాల్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటన సమాచారం తెలియగానే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద సంగీత ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కూలి పనులకు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. మృతులు, క్షతగాత్రులు ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60మంది ప్రయాణికులు ఉన్నారు.

తెల్లవారుజామున వేగంగా ప్రయాణిస్తూ బస్సు అదుపుతప్పడమే ప్రమాద కారణంగా భావిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్షమే కారణమా లేక బస్సులో లోపాలేమైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసుల దృష్టిసారించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications