డ్రైవర్‌కు తగ్గిన బిపి: ఆటోను ఢీకొట్టిన కారు (పిక్చర్స్)
హైదరాబాద్: డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా బీపీ తగ్గడంతో కారు అదుపు తప్పి బస్టాప్‌లో నిలిపి ఉంచిన ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దురు విద్యార్థినులతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాదులోని నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
గోల్నాకలోని తులసీనగర్‌కు చెందిన విశ్రాంతాచార్యుడు ఎం. నరసింహారావు (62) మంగళవారం మధ్యాహ్నం తన కారులో ఆస్పత్రికి బయలుదేరారు. ఫీవర్ ఆస్పత్రి సమీపంలోని ఆర్టీసి బస్టాప్ వద్దకు రాగానే అతనికి బీపి తగ్గి కళ్లు మూతలు పడ్డాయి.
దాంతో కారు అదుపు తప్పి బస్టాపులో ఆగిన ఆటోను ఢీకొట్టింది. దీంతో కారుతో పాటు ఆటో కూడా బస్టాప్‌లో నించున్నవారి పైకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

ఐదుగురికి గాయాలు
కారు ప్రమాదంలో రామంతపూర్‌కు చెందిన విద్యార్థినులు ఎన్ శైలజ (19), పావని (19), పెయింటర్ బి. రాజు (26), ఆటో డ్రైవర్ కిషన్ నాయక్, కారు నడుపుతున్న నరసింహారావు గాయపడ్డారు.

కారు ప్రమాదం
నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగిందని బస్టాపులో ఉన్న ప్రయాణికులు నరసింహారావుపై చేయి చేసుకున్నారు.

ఆస్పత్రులకు తరలింపు
గాయపడినవారిని పోలీసులు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఆస్పత్రిలో...
చేయని తప్పునకు గాయపడినవారు ఇలా ఆస్పత్రి పడకలపై నిస్త్రాణంగా పడి ఉన్నారు. వారికి చికిత్స చేస్తున్నారు.

ఐదుగురిదీ ఇదే స్థితి..
కారు అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో గాయపడినవారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా ఇలా..












Click it and Unblock the Notifications