Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ షాక్: టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్? ఏం చేద్దామని జగన్ ఆరా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు ముందు మరో భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు.

Recommended Video

    Five YSR Congress Party Leaders To Join TDP Soon టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్| Oneindia Telugu

    అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు ముందు మరో భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు.

    రాయలసీమలో వైసిపికి పట్టు ఉంది. ఆ ప్రాంతం నుంచే నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టిడిపిలోకి జంప్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

     11 మంది చేరుతారని అన్నారు

    11 మంది చేరుతారని అన్నారు

    నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలలో టిడిపి గెలిచినప్పటి నుంచి ఈ తరహా ప్రచారం సాగుతోంది. టిడిపిలోకి వైసిపి నుంచి 11 మంది ప్రజాప్రతినిధులు వస్తారని, వారు తమతో టచ్‌లో ఉన్నారని మంత్రులు ప్రకటించారు. కానీ ఆ పదకొండు మంది ఎవరు, ఏం జరిగిందనేది తెలియదు.

     తెరపైకి నేతల పేర్లు

    తెరపైకి నేతల పేర్లు

    కొందరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాము పార్టీ మారటం లేదని, వైసిపిలోనే ఉంటామని వారు ప్రకటించడంతో విషయం చల్లబడింది. నంద్యాల, కాకినాడ తర్వాత చాలామంది టిడిపి వైపు చూస్తారని చెప్పినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

    టిడిపిలోకి ఐదుగురు

    టిడిపిలోకి ఐదుగురు

    కానీ, తాజాగా మరోసారి వైసిపి నుంచి ఐదుగురు ప్రజాప్రతినిధిలు టిడిపిలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. రాయలసీమ ప్రాంత నేతలు పచ్చ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.

     మళ్లీ గుర్నాథ్ రెడ్డి, బుట్టా రేణుకల పేర్లు

    మళ్లీ గుర్నాథ్ రెడ్డి, బుట్టా రేణుకల పేర్లు

    ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలతో పాటు కర్నూలుకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు.

     రేపో మాపో చేరికలు

    రేపో మాపో చేరికలు

    గుర్నాథ్ రెడ్డి ఇవాళో, రేపో టిడిపిలో చేరవచ్చునని అంటున్నారు. బుట్టా రేణుక వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చునని చెబుతున్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలతోను చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

     ఏం చేద్దామని జగన్

    ఏం చేద్దామని జగన్

    అనంతపురంలో గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరితే ఏం చేద్దామని వైసిపి అధినేత వైయస్ జగన్ ఇప్పటికే నేతలతో చర్చించారని తెలుస్తోంది. కీలక నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం జరగడంపై వైసిపి ఆందోళన చెందుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+