ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీ వార్ మరింత తీవ్రం-జగన్, చంద్రబాబు, పవన్ ఫొటోలతో వార్..

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయాల్లో ఫ్లెక్సీల వార్ మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ బహిరంగ విమర్శలకే పరిమితమవుతున్న అధికార, విపక్షాలు ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో తమ వార్ ను మార్చేశాయి. జగన్ క్లాస్ వార్ ఫ్లెక్సీలతో వైసీపీ ప్రచారం ప్రారంభించగా.. దానికి కౌంటర్ గా బాబాయ్ హత్య, జగన్ పాలనను టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు పెడుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.

రాష్ట్రంలోని నంద్యాల, ఒంగోలు, మచిలీపట్నం, వైజాగ్, కైకలూరు, ఇలా రోజురోజుకీ ఫ్లెక్సీ వార్ పెరిగిపోతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన అన్నట్లుగా సాగుతున్న ఈ ఫ్లెక్సీ వార్ ఇప్పటికే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఏ స్ధాయికి చేరుతుందో అన్న చర్చ సాగుతోంది. వైఎస్ జగన్ ప్రారంభించిన క్లాస్ వార్ వ్యూహాన్ని ఫ్లెక్సీల రూపంలోకి అధికార వైసీపీ మార్చేసింది. పేదలకూ, ధనికులకూ మధ్య యుద్ధం అంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు.

flexies war between ysrcp, tdp and jansena intensified across ap now

దీనికి కౌంటర్ గా టీడీపీ నేతలు బాబాయ్ హత్యను, జనసేన నేతలు రాక్షస పాలనకు అంతం పేరుతో ఫ్లెక్సీలు కడుతున్నారు. దీంతో ఈ పోటాపోటీ ఫ్లెక్సీలు ఆయా పార్టీల కార్యకర్తలకు, నేతలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. క్షేత్రస్ధాయిలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇన్నాళ్లు తాము చేస్తున్న విమర్శల్ని విపక్షాలు ఫ్లెక్సీల రూపంలోకి మార్చేశాయి. ఇది కాస్తా వైసీపీకి మంట పుట్టిస్తోంది. దీంతో అధికార పార్టీ పోలీసుల్ని రంగంలోకి దింపుతోంది.

flexies war between ysrcp, tdp and jansena intensified across ap now

రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ ఫ్లెక్సీలకు పోటీగా టీడీపీ, జనసేన నేతలు పెడుతున్న ఫ్లెక్సీల్ని పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో ఆయా చోట్ల ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతున్నాయి. పోలీసులతో విపక్ష పార్టీల నేతలు వాగ్వాదానికి దిగడం, వారిని నియంత్రించలేక అరెస్టు చేసి కేసులు పెట్టడం జరుగుతోంది. అయితే ఇది విపక్ష పార్టీల్ని మరింత రెచ్చగొట్టినట్టవుతోంది. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా మరిన్ని ఫ్లెక్సీలు పెట్టేందుకు టీడీపీ, జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+