విజయవాడ-కర్నూలు ప్రజలకు పండగలాంటి వార్త..!
విజయవాడ మరియు కర్నూలు ప్రజలకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ-కర్నూలు మధ్య విమాన సర్వీసులు ఎట్టకేలకు ప్రారంభం కాబోతున్నాయి. జూలై 2, 2025 నుంచి ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా తెలియజేశారు.
స్పీడ్‌జెట్ విమానయాన సంస్థ ఈ మార్గంలో వారానికి మూడు రోజులు - సోమ, బుధ, శుక్రవారాల్లో - తమ సేవలను అందించనుందని మంత్రి తెలిపారు. దీని ద్వారా విమాన ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంలో ఇది కీలక అడుగు అని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

సుమారు 1.5 గంటల పాటు సాగే ఈ విమాన ప్రయాణం, రోడ్డు మార్గంలో సుదీర్ఘమైన 5-6 గంటల ప్రయాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఇది ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చడమే కాకుండా, పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాలకు కొత్త ఊపిరి పోయనుంది.












Click it and Unblock the Notifications