ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ 2023: అమితాబ్ బచ్చన్ పై సిఏఐటీ ఫిర్యాదు!!

త్వరలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతుంది. ఆఫర్ల పండుగకు వినియోగదారులు కూడా సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 8 నుండి 15వ తారీఖు వరకు వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ ను ప్రారంభిస్తుంది. భారీ ఆఫర్లతో, బంపర్ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నేపధ్యంలో ఈ మేరకు flipkart ఒక యాడ్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

ఫ్లిప్ కార్ట్ కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ఒక యాడ్ ఇప్పుడు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కు ఆగ్రహం తెప్పించింది. అమితాబ్ బచ్చన్ నటించిన ఆ యాడ్ పై మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. అసలు ఇంతకీ ఆ యాడ్లో అమితాబ్ బచ్చన్ ఏం చెప్పారంటే..

Flipkart Big Billion Days Sale 2023: CAIT complaint on Amitabh Bachchan advertisement for flipkart!!

ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ యొక్క మొబైల్ ఫోన్ల డీల్స్, డిస్కౌంట్ లు ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండవు అన్నట్టుగా కేవలం ఫ్లిప్‌కార్ట్‌ లో మాత్రమే లభిస్తాయి అన్నట్టుగా అమితాబ్ బచ్చన్ ఆ యాడ్లో నటించారు. ఇక ఈ యాడ్ అవకాశం ఉందని సాంప్రదాయ రిటైల్ మార్కెట్ కు అంతరాయం కలిగించడానికి ఇటువంటి ప్రకటనలు దోహదం చేస్తాయని సిఏఐటి అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ మేరకు అమితాబ్ బచ్చన్ కు ఒక లేఖ కూడా రాసింది.ఆయన చేసిన యాడ్ భారతదేశంలోని రిటైలర్ లకు బాగా నష్టం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రకటనను తీసివేయడం మాత్రమే కాకుండా, ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున జరిమానా విధించాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ మంత్రిత్వ శాఖను కోరింది.

అమితాబ్ బచ్చన్ చేసిన ఈ ప్రకటన ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తుంది అని సీఏఐటీ పేర్కొంది. ఇక ఈ తప్పుదారి పట్టించే ప్రకటనలు అనైతికమైనవని, అవి మంచి పోటీని వక్రీకరిస్తాయని, దీనివల్ల చిన్న చిన్న షాపుల వారికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+