ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024: ఆఫర్ల పండుగకు సిద్ధం అయిపోండి!!

వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ తన రాబోయే ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ను త్వరలో రాబోతున్నట్లు ప్రకటించింది. భారీ ఆఫర్లతో, బంపర్ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జనవరి 14 నుండి జనవరి 19 వరకు మొత్తం ఆరు రోజుల పాటు రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్ నిర్వహించాలని ఫ్లిప్ కార్ట్ ప్లాన్ చేసింది.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ద్వారా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడానికి ప్లాన్ చేస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులకు బ్యాంక్ ఆఫర్లు, తగ్గింపులు, క్యాష్ బ్యాక్ లు, ధరల తగ్గింపులను విస్తృతంగా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనుంది.

Flipkart Republic Day Sale 2024: Get Ready for a Festival of Offers!!

ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే అంటే జనవరి 13వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. కొత్తగా విడుదల కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించడానికి ఫ్లిప్ కార్ట్ సిద్ధమైంది.అయితే ఇంకా క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ఏ ఏ బ్యాంకు కార్డులపై ఇస్తారు అనేది మాత్రం ఫ్లిప్కార్ట్ ఇంకా ప్రకటించలేదు.

స్మార్ట్ ఫోన్ల ఆఫర్ల విషయానికి వస్తే మోటరాలో ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ సెవెన్ ఏ, శామ్సంగ్ ఎస్ 21ఎఫ్ఈ 5జి, రియల్ మీ 11 ఎక్స్ 5జి, మోటో జి54 5జి, శాంసంగ్ ఎఫ్14జి, రియల్ మీ సి 53 సహా మరికొన్ని స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ఉన్నట్టు వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది.

వీటితో పాటు ఫ్యాషన్ యాక్సెసరీస్ పై 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఇవ్వనుంది. హోమ్ అప్లయన్సెస్ పై 75% వరకు ఆఫర్లు ఇవ్వనుంది. బ్యూటీ, ఫుడ్, టాయ్స్ పై 85% వరకు తగ్గింపు ఇవ్వనుంది. ఫర్నిచర్ పై 80% వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+