Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023: మొబైల్స్, ల్యాప్‌టాప్ లు, టీవీలపై భారీ డిస్కౌంట్స్!!

వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ 2023 సంవత్సరం చివరలో బంపర్ సేల్ కు రెడీ అయ్యింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్ల నుండి టీవీల వరకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు 7రోజుల పాటు ఈ సేల్ కొనసాగుతుందని పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పై 50% నుంచి 80 శాతం వరకు భారీ తగ్గింపు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. flipkart నిర్వహించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫ్యాషన్, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందించనుంది. flipkart ప్లస్ మెంబర్షిప్ యూజర్లు ఒకరోజు ముందుగానే ఈ సేల్ లో పాల్గొనవచ్చని పేర్కొంది. అంటే వీరికి నేటి నుండే సేల్ అందుబాటులో ఉంటుంది.

Flipkart Year End Sale 2023: Huge discounts on mobiles, laptops, TVs!!

ఫ్లిప్ కార్ట్ అందించే ఈ సేల్ లో ఐ ఫోన్ 14 రిటైల్ ధర 69,900 రూపాయలుగా ఉండగా, కేవలం 55 వేల రూపాయలకే ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఐఫోన్ మాత్రమే కాకుండా, గూగుల్ పిక్సెల్ సెవెన్ సిరీస్ మరియు గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లలో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.

Samsung Galaxy S21 FE (2023)ని డిస్కౌంట్ పోగా రూ. 31,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా మోటరోలా, వివో వంటి మొబైల్ ఫోన్ల పైన కూడా ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్ లనే ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ లో ల్యాప్ టాప్ లు, టీవీలు ఇతర ఉత్పత్తుల పైన కూడా తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్ టాప్ ల పైన కూడా మంచి ఆఫర్లు ఇస్తున్న ఫ్లిప్ కార్ట్ ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ తో వచ్చే acer one14 36,990 రూపాయలకే అందించనుంది. HP 255 G9 840T7PAని రూ.19,990కి ఆఫర్లో అందిస్తుంది ఫ్లిప్ కార్ట్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+