ట్రాక్టర్ నడిపిన జగన్, చుట్టేస్తున్న చెల్లి షర్మిల (పిక్చర్స్)
హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశను మారుస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగన్, షర్మిల, వైయస్ విజయమ్మలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
జగన్ సీమాంధ్రలో పర్యటిస్తున్నారు. మరో 16 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో తమ పార్టీని గెలిపించాలన్నారు. అధికారం చేపట్టిన వెంటనే తొలిసంతకం అమ్మ ఒడి పథకంపై పెడతానని, రెండో సంతకం పింఛన్ల పెంపు పథకంపైన, మూడో సంతకం రైతులకు సహాయం అందించేందుకు ఉద్దేశించిన పథకంపై పెడతానని జగన్ వివరించారు.
ఈ పథకం అమలైతే.. రైతులు 103కి ఫోన్ చేస్తే 'కుయ్ కుయ్' మంటూ చేను దగ్గరకే శాస్త్రవేత్తలు వచ్చి సహాయం అందిస్తారని జగన్ తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై నాలుగో సంతకం, వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చూడటం కోసం ఐదో సంతకం పెడతానని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్
తన పర్యటనలో చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. తనకన్నా బాబు పాతికేళ్లు పెద్దవారని.. ఆయనకు చివరి ఎన్నికలు కావడంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ పచ్చి అబద్ధాల కోరుగా మిగులుతున్నారని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెస్
చంద్రబాబు చెబుతున్న రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీ చేయాలంటే రూ. 1.50లక్షల కోట్ల్లు కావాలని, మన బడ్జెట్ కూడా అంత లేనందున అదెలా సాధ్యమని జగన్ ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెస్
చంద్రబాబు పాలనలో పేదలకు పింఛన్లు అందక, పక్కా గృహాలు అందక నానా అ వస్థలు పడ్డారని అన్నారు. ఆ భయానక పాలన మళ్లీ మనకు అవసరమా అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
చంద్రబాబుకున్న నిజాయితీ, విశ్వసనీయత తనకు అవసరం లేదని.. వైయస్ నుంచి వారసత్వంగా వచ్చిన నిజాయితీ, విశ్వసనీయతలు తనకు చాలని జగన్ పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ సీమాంధ్రలో జోరుగా పర్యటిస్తుండగా.. షర్మిల తెలంగాణలో దూసుకు పోతున్నారు. ఎన్నికలకు మరో ఎనిమిది రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణను చుట్టేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
సీల్డ్‌కవర్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని షర్మిల మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని ఆమె ప్రసంగించారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్ రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలన్నింటిని విస్మరించారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై భారం పడకుండా గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రజల పక్షానా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మకయ్యారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్ జగన్ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి మరి మద్దతు ఇచ్చారని షర్మిలా విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెస్
సురాజ్యం కోసం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల పక్షానా ఉండే జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావ్ షెట్కార్‌ను, ఎంపీ అభ్యర్థి మొయినొద్దిన్‌లను గెలిపించాలని ఆమె కోరారు.

వైయస్సార్ కాంగ్రెస్
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ పరిశీలకులు జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. షర్మిల జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, పటాన్ చెర తదితర ప్రాంతాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications