ఈ ముగ్గురివే ఫోర్జరీ!: కొత్తపల్లి గీతపై పీఎస్‌లో ఫిర్యాదు

 Forgery: Complaint on Kothapalli Geetha
విశాఖపట్నం: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ పాడేరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో శనివారం పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నామినేషన్ పత్రంలో తమ సంతకాలను గీత ఫోర్జరీ చేసి తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గీత ఎన్నికల అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రంలో ప్రతిపాదితుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.

ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు కూడా ఎమ్మెల్యే ఈశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ సంతకాలను ఫోర్జరీ చేసిన గీతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాడేరుకు చెందిన సిహెచ్ గోపాల కృష్ణ, హేమ కుమార్, గౌరీశంకర రావు స్థానిక ఎస్సైకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

గీత ఎన్నికల అధికారులకు దాఖలు చేసిన నామినేషన్ పత్రం నకలు, తమ ఓటరు గుర్తింపు కార్డు వంటి వివరాలను వారు అందచేశారు. గీత ఫోర్జరీ సంతకాలు చేసినట్టుగా అందిన ఫిర్యాదును ఎస్సై వెంటనే ఎఎస్‌పి దృష్టికి తీసుకువెళ్లి రూరల్ ఎస్‌పితో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+