ఫోర్జరీ పెకాశం ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి .. మిమ్మల్నేమి అనరు - విజయసాయి సైరా పంచ్

సైరా పంచ్ లతో ట్విట్టర్ వేదికగా టీవీ9 రవి ప్రకాష్ ను , ఆపరేషన్ గరుడ శివాజీని పరేషాన్ చేస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి . ఒకటి కాదు రెండు కాదు వరుసగా ట్వీట్లు చేస్తూ రవి ప్రకాష్, శివాజీల పరువు తీసేస్తున్నారు.

ట్విట్టర్ లో చెలరేగిపోతున్న విజయసాయి .. వరుస ట్వీట్లతో పంచ్ లు

రోజుకో అంశంతో అటు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న విజయసాయి రెడ్డి అధికార పార్టీ కి సహకరించిన వారిని కూడా ఏ మాత్రం వదిలేలా లేరు. అందులో భాగంగానే టీవీ9 రవి ప్రకాష్ ని, ఆపరేషన్ గరుడ అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసిన శివాజీని ట్విట్టర్ వేదికగా ఉతికి ఆరేస్తున్నారు. టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీలపై సెటైర్లు వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రవిప్రకాశ్, శివాజీలు అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తలపై ట్విట్టర్ వేదికగా పంచ్ లు వేశారు. మిమ్మల్నేమీ అనరు వచ్చేయండి అంటూ పోస్ట్ చేశారు.

ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ సెటైర్లు

ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ సెటైర్‌ వేశారు విజయసాయిరెడ్డి. మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్‌లో వైట్‌ బోర్డు, మార్కర్‌ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు . అంతే కాదు కోర్టులో రవిప్రకాష్ , శివాజీలు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ కోర్టు తిరస్కరించటంతో రవి ప్రకాష్, శివాజీలకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయంటూ విజయసాయి రెడ్డి సైరా పంచ్ వేశారు.

లంచ్ మోషన్ పిటీషన్ హైకోర్టులో తిరస్కరించటం వల్ల లూజు మోషన్స్ అని విచారణకు హాజరు కాలేరట.. సైరా పంచ్

లంచ్ మోషన్ పిటీషన్ హైకోర్టులో తిరస్కరించటం వల్ల లూజు మోషన్స్ అని విచారణకు హాజరు కాలేరట.. సైరా పంచ్

లంచ్ మోషన్ పిటీషన్ హైకోర్టులో తిరస్కరించటం వల్ల లూజు మోషన్స్ వల్ల విచారణకు హాజరు కాలేమని పోలీసులకు ఈ మెయిల్ పంపిన శివాజీ , రవి ప్రకాష్ అంటూ సైరా పంచ్ వేశారు. అంతే కాదు మెరుగైన సమాజం కోసం మోసాలు చేసి మోషన్స్ అని పారిపోయాడు అంటూ ట్వీట్ చేశారు. రవి ప్రకాష్ ఫోర్జరీ ఎపిసోడ్ మొదలైన నాటి నుండీ నేటి వరకు ట్విట్టర్ లో రవి ప్రకాష్ , శివాజీలని టార్గెట్ చేస్తూనే ఉన్నారు విజయసాయిరెడ్డి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+