Gummadi Kuthuhalamma: మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత-ఐదుసార్లు ఎమ్మెల్యే-డిప్యూటీ స్పీకర్

తిరుపతి : ఏపీలో మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల కుతూహలమ్మ అనారోగ్యంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఉదయం తిరుపతిలోని తన స్వగృహంలో కుతూహలమ్మ మృతి చెందారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి గుమ్మడి కూతుహలమ్మ వృతి రీత్యా డాక్టర్ . 1978లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో గెలుపుతో ఆమె.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985,1989,1999, 2004 ఎన్నికలలో వేపంజేరి నియోజకవర్గం నుంచి, 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కుతూహలమ్మ గెలిచారు.

former ap minister and ex deputy speaker gummadi kuthuhalamma passed away at 74 years

1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడం తో వేపంజేరి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన కుతూహలమ్మ.. అనంతరం టీడీపీలో చేరారు. 2014లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆమె ఓడిపోయారు. 1992-1993 మధ్య కాలంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి మంత్రి వర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. 2004లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. తిరుపతిలోని ఇంట్లో ఉదయం నిద్రలోనే కుతూహలమ్మ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+