కాకినాడ తీర్మానం రూపకర్త బంగారు లక్ష్మణ్! (పిక్చర్స్)
హైదరాబాద్: బిజెపి జాతీయ మాజీ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 74ఏళ్లు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బంగారు లక్ష్మణ్ సికిందరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బంగారు లక్ష్మణ్ మృతిపట్ల జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి నేతలు, బిజెపి సీనియర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివిధ పార్టీల నేతలు లక్ష్మణ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆదివారం ఢిల్లీ నుంచి జాతీయ నేతలు వస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. అనంతరం ఆయన అంతిమ సంస్కారం నిర్వహిస్తామని లక్ష్మణ్ కుటుంబీకులు చెప్పారు.
నర్సింహ, శివమ్మ దంపతులకు 1939 మార్చి 17న బంగారు లక్ష్మణ్ జన్మించారు. నాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో, అనంతరం ఉస్మానియా యూనివర్శిటీలో బిఎ చదివారు. లా కళాశాలలో ఎల్‌ఎల్‌బి చదివారు. బి సుశీలను 1972 నవంబర్ 6న వివాహం చేసుకున్నారు. ఆమె రాజస్థాన్ జూలోర్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

బంగారు లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కన్ను మూశారు. సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారంనాడు తుదిశ్వాస విడిచారు.

బంగారు
1939లో జన్మించిన బంగారు లక్ష్మణ్ 2000 - 2001 మధ్య కాలంలో బిజెపి జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో 1999 నుంచి 2000 వరకు రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

లక్ష్మణ్
రక్షణ కొనుగోళ్ల కుంభకోణంలో ఆయనకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని మాదిగ కుటుంబంలో పుట్టిన ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన బిఎ, ఎల్ఎల్‌బి హైదరాబాదులో పూర్తి చేశారు.

భార్య సుశీల
ఆయన భార్య సుశీలా లక్ష్మణ్ 14వ లోకసభలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాజస్థాన్‌లోని జాలోర్ నియోజక వర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

రాజకీయాలు
చిన్న వయస్సులోనే ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలు జీవితం గడిపారు. బంగారు లక్ష్మణ్ 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

సంతాపం
బంగారు లక్ష్మణ్ మృతికి బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

కాకినాడ తీర్మానం
బంగారు లక్ష్మణ్ బిజెపిలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలక పదవులను నిర్వహించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో 1997లో రాష్ట్ర బిజెపి చేసిన కాకినాడ తీర్మానంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీనియర్ నేత శేషగిరి రావుతో కలిసి స్వయంగా ఆ తీర్మానం చేశారు.












Click it and Unblock the Notifications