వైజాగ్ స్టీల్ పోరు : కేఏ పాల్ తో చేతులు కలిపిన జేడీ లక్ష్మీనారాయణ..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాడుతున్న వ్యక్తులు, సంస్ధలు, ప్రజాసంఘాలు క్రమంగా ఏకమవుతున్నాయి. ఇప్పటికే ముడి సరుకు కోసం స్టీల్ ప్లాంట్ కోరిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ .. జోరు పెంచుతున్నారు. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే పోరాడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు.

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్షీనారాయణ ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో కలిసి వైజాగ్ లో అకస్మాత్తుగా దర్శనమిచ్చారు. ఇరువురూ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టారు. వైజాగ్ స్టీల్ కోసం ఇప్పటికే పోరాడుతున్న కేఏ పాల్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ జేడీ ప్రకటించారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ కోసం తాను చేస్తున్న పోరాటాన్ని కేఏ పాల్ అందరికీ వివరించారు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

 kapauljdlakshminarayana

స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం డ్రామా ఆడుతోందని కేఏ పాల్ తెలిపారు. తాను ప్రధాని, కేంద్రమంత్రుల్ని 20, 30 సార్లు కలిశానని పాల్ తెలిపారు. ఈ విషయంలో లక్ష్మీనారాయణకు మద్దతిస్తున్నానని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు 99 శాతం పనులు అన్ని పూర్తయ్యాయన్నారు. 37 మంది ప్రాణ త్యాగాలు చేశారని, 18 వేల మంది భూములిచ్చారని, దీన్ని 3500 కోట్లకు అమ్మేస్తున్నారని పాల్ తెలిపారు. చివరి నిమిషంలో తాను ఫైట్ చేసి ఆపానన్నారు. హైకోర్టు విచారణకు ముందే వారు ప్రైవేటీకరణ చేశారన్నారు. ప్రైవేటీకరణ ఆపేందుకు తాను, జేడీ కోర్టులకు వెళ్లామని, కోర్టులకు గౌరవం ఇవ్వట్లేదని, అదే విషయం సీజేఐ చంద్రచూడ్ కు చెప్పానని పాల్ తెలిపారు.

కేంద్రంతో పాల్ కు ఉన్న సత్సంబంధాలతో ప్రైవేటీకరణ ఆపమని కోరేందుకే ఇక్కడికి వచ్చినట్లు సీబీఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. అందరూ కలిస్తే ప్రైవేటీకరణ ఆగుతుందని అనుకునే కలిశాననన్నారు. ప్రైవేటీకరణ ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కలిసి పనిచేస్తానన్నారు. విశాఖ స్టీల్ కు 7.3 మిలియన్ టన్ను సామర్ధ్యం ఉందని, దేశ వ్యాప్తంగా 122 మిలియన్ టన్నుల సామర్ద్యం ఉందని మాజీ జేడీ తెలిపారు. 173 మిలియన్ టన్నులకు మన స్టీల్ కెపాసిటీ పెంచుకోవాలని ఆయన కోరారు.

 kapauljdlakshminarayana

సెయిల్ వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ల కెపాసిటీ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఓవైపు కేంద్రం చేతులో ఉన్న సెయిల్ ను ప్రోత్సహిస్తూ వైజాగ్ స్టీల్ ను అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ నూ సెయిల్ ఆధ్వర్యంలో ఉంచి ప్రోత్సహిస్తే 7.3 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులకు దీని సామర్ధ్యం పెంచవచ్చన్నారు.వ్యూహాత్మక రంగంలో లేని సెయిల్ లో ఉన్న కంపెనీలను ఎందుకు ప్రైవేటీకరించడం లేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+