జగన్ మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా ప్రకటన-ఆ భయంతో కాదని క్లారిటీ..!
ఏపీలో ఒకప్పుడు డిప్యూటీ సీఎంగా ఓ వెలుగు వెలిగిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపిన ఆయన.. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ఆ విషయం వెల్లడించారు. అంతే కాదు తన రాజీనామా వెనుక ఉన్న కారణం, జిల్లా వైసీపీ కార్యాలయం కూల్చివేత వంటి అంశాలపై కీలక విషయాలు బయటపెట్టారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఆళ్ళ నాని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. వైసీపీ జిల్లా జిల్లా అధ్యక్ష పదవికి,నియోజకవర్గ ఇంచార్జి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానని, ఇప్పుడు కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు.

తన వ్యక్తి గత బాధ్యతల వల్లే వైసీపీకి రాజీనామా చేశానని, ఓటమి భయంతో కాదని ఆళ్ల నాని చెప్పుకొచ్చారు. జిల్లా వైసీపీ కార్యాలయానికి లీజ్ అగ్రిమెంట్ పూర్తి కావడం వల్లే పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేశారని ఆయన వెల్లడించారు. పార్టీ అదిస్టానం ఆదేశాల మేరకే పార్టీ కార్యాలయాన్ని స్థల యజమానికి అప్పగించామన్నారు. అంతే తప్ప ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. అయితే తన తదుపరి కార్యాచరణ మాత్రం ఆళ్లనాని వెల్లడించలేదు. కొంతకాలం పాటు సైలెంట్ గా ఉండి భవిష్యత్తులో కూటమిలో భాగమైన జనసేనలో ఆయన చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications