వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్మ వర్గం రాజకీయంగా.. స్పందించరా : వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కీలక వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ హోం మంత్రి..మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల పైన స్పందించారు. ఏపీ కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటని ప్రశ్నించారు.

Former Home Minister Vasantha Nageswara Rao key comments on Kamma community priority in AP Politics

వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేకం ఉన్నాయని వివరించారు. కానీ, ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలో కమ్మ వర్గం పైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్దం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల వారి పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు మారితే భవిష్యత్ తరాలు రాజకీయాల్లోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో కంటే పక్క రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందన్నారు.

Former Home Minister Vasantha Nageswara Rao key comments on Kamma community priority in AP Politics

తెలంగాణలో కమ్మ మంత్రి ఉన్నారు
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో తెలంగాణ మంత్రులు ఉన్నారని..ఏపీలో లేకపోవటం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వసంత నాగేశ్వర రావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా పైన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం జగన్ తన తొలి కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ ఏడాది జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కొడాలి నానిని తప్పించారు. కమ్మ వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు.

Former Home Minister Vasantha Nageswara Rao key comments on Kamma community priority in AP Politics

రాజకీయ చర్చగా వసంత వ్యాఖ్యలు
దీంతో, కొడాలి నానికి రాష్ట్ర స్థాయిలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని భావించారు. కానీ, స్వీకరించేందుకు కొడాలి నాని అంగీకరించలేదు. మంత్రి పదవి పోయినందుకు ఈ పదవి ఇచ్చారనే అభిప్రాయం కలుగుతుందని, తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఆ తరువాత ఇతర అగ్రకులాలతో పాటుగా కమ్మ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం.. చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆ వివాదం ముగిసింది. తిరిగి ఇప్పుడు వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో దీని పైన వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.

English summary
Former Home minister Vasantha Nageswara Rao key reamarks on political priority ofr Kamma community in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X