కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన మాజీ మంత్రి కొడాలి నాని కార్ యాక్సిడెంట్!!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం ఈరోజు కుటుంబ సమేతంగా మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడకు వచ్చారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ గుడి నుండి తిరిగి వెళ్ళే సమయంలో కొడాలి నాని కారు వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బారికేడ్ ను ఒక్క సరిగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన కారులోనే కొడాలి నాని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావిస్తున్నారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు, భద్రత సిబ్బంది కూడా చిన్న ప్రమాదం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం అనంతరం అదే కారులో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. కొడాలి నాని కారుకి ప్రమాదం జరిగిందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్ గా బయట పడ్డారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు విజయవాడ వైసీపీ నేతలు, వీరాభిమానులు కొందరు కొడాలి నానికి ఫోన్ చేసి పరామర్శించారు. కార్ యాక్సిడెంట్ పై అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కొడాలి నాని ఇంట్లో నిన్న ఓ శుభకార్యం జరిగింది. కొడాలి నాని మేనకోడలి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మేనకోడలు పెళ్లి వేడుక కంకిపాడులోని అయానా కన్వెన్షన్ లో జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఇక వివాహానంతరం ఈరోజు తెల్లవారుజామున కొడాలి నాని కుటుంబ సభ్యులు దుర్గ గుడికి వెళ్ళగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కానీ అందరూ క్షేమంగా ఉండటంతో ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications