వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో బుదవారం నాడు వైసీపీలో చేరారు.

అఖిలప్రియకు బాబు షాక్: మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్ళాల్సింది, వైసీపీ నుండి టిడిపిలోకి

రెండు రోజుల క్రితం ఆయన టిడిపికి రాజీనామా చేశారు. త్వరలో జరిగే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అనుసరించిన నాన్చివేత ధోరణిని నిరసిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

Former minister Silpa Mohan reddy joins in Ysrcp

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. టిడిపిలో టిక్కెట్టు దక్కదనే కారణంగానే ఆయన పార్టీని వీడినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు మూడేళ్ళుగా టిడిపిలో తాను అవమానాలకు గురైనట్టు శిల్పా చెప్పారు.

టిడిపిలోనే, రాజకీయాలతో బంధుత్వానికి సంబంధం లేదు: శిల్పాచక్రపాణిరెడ్డి

నంద్యాల మున్సిఫల్ ఛైర్ పర్సన్ సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, పలువరు సర్పంచులు, ఎంపిటీసీ సభ్యులు శిల్పా మోహన్ రెడ్డితో కలిసి వైసీపీలో చేరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Silpa Mohan reddy joined in Ysrcp on Wednesday at Hyderabad. Two days back he resigned to Tdp. he joined in Ysrcp with his followers.
Please Wait while comments are loading...